RCB vs CSK : ఆర్‌సీబీ, చెన్నై మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. మ్యాచ్ ర‌ద్దైతే బెంగ‌ళూరు ప్లేఆఫ్స్ పై ప్ర‌భావం ఎంత‌?

శ‌నివారం చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది.

RCB vs CSK : ఆర్‌సీబీ, చెన్నై మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. మ్యాచ్ ర‌ద్దైతే బెంగ‌ళూరు ప్లేఆఫ్స్ పై ప్ర‌భావం ఎంత‌?

Courtesy BCCI

Updated On : May 3, 2025 / 11:42 AM IST

ఐపీఎల్ 2025లో భాగంగా శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు మ‌రింత చేరువ కావాల‌ని ఆర్‌సీబీ భావిస్తోంది. మ‌రోవైపు ఇప్ప‌టికే చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికి గ‌త సీజ‌న్‌లో త‌మ ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసిన ఆర్‌సీబీపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని చెన్నై భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశం ఉంది.

అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. గ‌త రెండు రోజులుగా బెంగ‌ళూరు న‌గ‌రంలో వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ రోజు కూడా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది. భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌కారం.. శ‌నివారం మ‌ధ్యాహ్నం లేదా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది.

GT vs SRH : స‌న్‌రైజ‌ర్స్, గుజ‌రాత్‌ మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్టర్ చేసిన ఈ త‌ప్పును గ‌మ‌నించారా?

క్రిక్ఇన్‌ఫో క‌థ‌నం ప్ర‌కారం మ్యాచ్‌కు ముందు రోజు వ‌ర్షం కార‌ణంగా ఇరు జ‌ట్ల ప్రాక్టీస్‌కు ఆటంకం క‌లిగింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చెన్నై ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. సుమారు 45 నిమిషాల త‌రువాత వ‌ర్షం ప‌డింది. వ‌ర్షం త‌గ్గిన త‌రువాత 4.30 గంట‌ల‌కు ఆట‌గాళ్లు మ‌ళ్లీ సాధ‌న మొదలుపెట్టారు.

సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో ఆర్‌సీబీ ఆట‌గాళ్లు సాధ‌న‌కు వ‌చ్చారు. కోహ్లీ, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌లు దాదాపు 45 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌గా.. ఆ స‌మ‌యంలో మ‌రోసారి వ‌ర్షం ప‌డింది. ఈ సారి ఏకంగా మూడు గంట‌ల పాటు వ‌ర్షం ప‌డింది. దీంతో ఆర్‌సీబీ ప్రాక్టీస్ సెష‌న్‌ను ర‌ద్దు చేశారు.

చిన్న‌స్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రెనేజ్ సిస్ట‌మ్ అందుబాటులో ఉంది. ఎంత భారీ వ‌ర్షం ప‌డిన‌ప్ప‌టికి కూడా.. వ‌ర్షం ఆగిన త‌రువాత కేవ‌లం 30 నుంచి గంట వ్య‌వ‌ధిలో మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేయొచ్చు.

Rajasthan Royals : అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజ‌స్థాన్ ఔట్‌.. కోల్‌క‌తా, పంజాబ్ ల‌కు కొత్త క‌ష్టం..!

ఒక‌వేళ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే.. అప్పుడు ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు ఆర్‌సీబీ 15 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది.

ఆర్‌సీబీ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. 14 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.521గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉంది.