Suryakumar Yadav : సునీల్ న‌రైన్‌.. కాస్త న‌వ్వ‌వ‌య్యా బాబు : సూర్య‌కుమార్

ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ సైతం స‌ర‌దాగా న‌రైన్‌ను ట్రోల్ చేశాడు.

Suryakumar Yadav : సునీల్ న‌రైన్‌.. కాస్త న‌వ్వ‌వ‌య్యా బాబు : సూర్య‌కుమార్

Photo Credit : www. IPLT20.COM

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ ప్లేయ‌ర్ సునీల్ న‌రైన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డు మైదానంలో సీరియ‌స్‌గా ఉండ‌టాన్ని చూస్తూనే ఉంటాం. బౌలింగ్‌లో వికెట్ తీసినా, బ్యాటింగ్‌లో సిక్స్ బాదినా కూడా అత‌డి ముఖంలో దాదాపుగా ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్స్ క‌నిపించ‌వు. దీంతో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో అత‌డిపై ఎన్నో మీమ్స్ వ‌చ్చాయి. ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేసుకోవ‌డంలో న‌రైన్‌ను మించిన వాడు లేడ‌ని కొంద‌రు కామెంట్లు చేస్తుంటారు.

తాజాగా ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ సైతం స‌ర‌దాగా న‌రైన్‌ను ట్రోల్ చేశాడు. కాస్త న‌వ్వ‌వ‌య్య బాబు అంటూ త‌న ఇన్‌స్ట్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.

Rishabh Pant : కోల్‌క‌తాపై ఘోర ఓట‌మి.. పంత్‌కు రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా..

ఏం జ‌రిగిందంటే.?

ఐపీఎల్ 17లో భాగంగా విశాఖ వేదిక‌గా బుధ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా 106 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 272 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో సునీల్ న‌రైన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ కేవ‌లం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాది 85 ప‌రుగులు చేశాడు.

న‌రైత్‌తో పాటు ర‌ఘువంశీ(27 బంతుల్లో 54), ర‌సెల్ (19 బంతుల్లో 41), రింకూసింగ్‌(8 బంతుల్లో 26)లు ధాటిగా ఆడారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 17.2ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఢిల్లీ బ్యాట‌ర్లో రిష‌బ్‌పంత్ (25 బంతుల్లో 55), ట్రిస్టియ‌న్ స్ట‌బ్స్ (32 బంతుల్లో 54) హాఫ్ సెంచ‌రీల‌తో పోరాడినా జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు.

RCB vs LSG : కోహ్లిని ఔట్ చేస్తాన‌ని మాట ఇచ్చి.. ప‌క్కాగా ప్లాన్ చేసి.. తొలి వికెట్‌గా ఔట్ చేసిన ల‌క్నో యువ స్పిన్న‌ర్‌.. కోచ్ ఆనందం

కాగా.. సునీల్ న‌రైన్‌, ర‌ఘువంశీ బ్యాటింగ్‌ను సూర్య‌కుమార్ యాద‌వ్ సోష‌ల్ మీడియాలో కొనియాడాడు. న‌రైన్ ఇలా బ్యాటింగ్ చేయ‌డం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంద‌ని, కొంచెం న‌వ్వు బ్ర‌ద‌ర్ అని అన్నాడు. మ‌రోవైపు ర‌ఘువంశీ అరంగ్రేటం అదిరిపోయింద‌ని తెలిపాడు.