Rishabh Pant : రిషబ్ పంత్.. వైభవ్ సూర్యవంశీ నుంచి పాఠాలు నేర్చుకో : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
వైభవ్ సూర్యవంశీని ఆదర్శంగా తీసుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) సూచించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.
Michael Vaughan urged Rishabh Pant to take notes from Vaibhav Sooryavanshi
- పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రిషబ్ పంత్
- టీమ్ఇండియాలో స్థానం కావాలంటే ఐపీఎల్లో అద్భుతంగా ఆడాలన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
- వైభవ్ సూర్యవంశీ తరహాలో దూకుడు అవసరమని కామెంట్స్
Rishabh Pant : వైభవ్ సూర్యవంశీని ఆదర్శంగా తీసుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు సూచించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే.. 9 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ సాయంతో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్లోనూ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. లక్నో జట్టును కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా తీసుకుని వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో పంత్ పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే అతడు వైభవ్ సూర్యవంశీ తరహాలో దూకుడైన ఆటతీరును కలిగి ఉండాలని అన్నాడు మైఖేల్ వాన్. పంత్ ఎంతో ప్రతిభావంతులైన ప్లేయర్లు ఉన్న దేశం తరుపున ఆడుతున్నాడు. అతడి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటే వేరే దేశాల జాతీయ జట్టులోనూ ఈజీగా చోటు సంపాదించుకోగలడు. అతడు బంతిని బలంగా కొడతాడు. మంచి కీపర్, ఆలోచన సామర్థ్యం అద్భుతం. అని మైఖేల్ వాన్ అన్నాడు.
అయితే.. భారత దేశానికి ఆడే విషయానికి వస్తే మాత్రం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ వంటి వికెట్ కీపర్ల నుంచి రిషబ్ పంత్‌కు తీవ్రమైన పోటీ ఉందన్నాడు. జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలంటే అతడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని సూచించాడు.
వైభవ్ సూర్యవంశీలా ఆడాలని, ముఖ్యంగా అతడు ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నాడు. ఇక బంతిని మైదానం ఆవలకు పంపించేందుకు ప్రయత్నించాలి. తాను 48 బంతుల్లో 100 పరుగులు చేయగలను అనే ఆలోచనా విధానాన్ని పంత్ కలిగి ఉండాలన్నాడు.
