Satya Nadella : భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. రాత్రంతా మేల్కొని..
Satya Nadella on IND vs NZ Semi final : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.

Satya Nadella on IND vs NZ Semi final
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ను దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. టీమ్ఇండియా విజయాన్ని చూసి కోట్లాది మంది అభిమానులు పులకించి పోయారు. కాగా.. టీవీ స్ర్కీన్‌కు అతుక్కుపోయిన వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.
సియాటిల్‌లో జరిగిన మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేశారు సత్యనాదెళ్ల. ఆ తరువాత వచ్చి రాత్రంతా నిద్రపోకుండా మ్యాచ్‌ను చూసినట్లు చెప్పారు. ‘సియాటెట్‌లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని వచ్చాను. మేము ఈ మీటింగ్‌ను షెడ్యూల్ చేసినప్పుడు ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ ఉంటుందని తెలియదు. ఈ మీటింగ్ అనంతరం రాత్రంతా మేల్కొని మ్యాచ్‌ను మొత్తం చూశాను. టీమ్ఇండియా విజయం సాధించడంతో ఆనందంగా ఉంది.’ అని సత్య నాదెళ్ల అన్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 398 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలు చేశారు. శుభ్‌మన్ గిల్ (80*), రోహిత్ శర్మ (47) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు, ట్రెంట్ బౌల్డ్ ఓ వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (134), కేన్ విలిమయ్సన్ (69) రాణించినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. మహ్మద్ షమీ ఏడు వికెట్లతో కివీస్‌ను గట్టి దెబ్బతీశాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.
Microsoft CEO talking about watching the India Vs New Zealand Semi Finals staying up all night. pic.twitter.com/vlv5llLqIF
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023
Kane Williamson : వాంఖడే పిచ్ మార్పు వివాదం పై కేన్ విలియమ్సన్.. చాలా బాధగా ఉంది