కేరళ కింగ్.. 37 బంతుల్లో అజహరుద్దీన్‌ సెంచరీ

కేరళ కింగ్.. 37 బంతుల్లో అజహరుద్దీన్‌ సెంచరీ

Updated On : January 14, 2021 / 7:48 AM IST

Kerala opening batsman Mohammad Azharuddeen : ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కేరళ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ సెంచరీల మోత మోగించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తనదైన ఆటశైలితో బ్యాటింగ్ ఝళిపించి ఆకాశమే హద్దుగా చెలరేగిన అజహరుద్దీన్ 54 బంతుల్లో 9ఫోర్లు, 11సిక్సులు బాది 137 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ముంబై బౌలర్లు వేసిన బంతులను వచ్చింది వచ్చినట్టు బౌండరీలు దాటించాడు. ఎలైట్‌, గ్రూప్‌ ఈ మ్యాచ్‌లో అజహరుద్దీన్ విధ్వంసంతో కేరళ 8 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి విజయం సాధించింది.

ఆదిత్య తారె (42), యశస్వి జైస్వాల్‌ (40) పరుగులు చేయగా ముంబై 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో అజహరుద్దీన్‌ 37 బంతుల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు రిషబ్‌ పంత్‌ పేరిట ఉంది. అప్పట్లో 32 బంతుల్లో పంత్ సెంచరీతో ఈ రికార్డును నెలకొల్పాడు.