Mrunal : విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించా – బాలీవుడ్ నటి

సినీ తారలు, క్రికెటర్లను ప్రేమించడం సాధారణ విషయమే.. క్రికెటర్లతో ప్రేమలోపడి.. పెళ్లిపీటలు ఎక్కిన నటీమణులు చాలామందే ఉన్నారు.

Mrunal : విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించా – బాలీవుడ్ నటి

Mrunal

Updated On : September 10, 2021 / 1:11 PM IST

Mrunal : భారత్ లో క్రికెటర్లకు యమ క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడితే పేరు ప్రఖ్యాతలు మాములుగా రావు. క్రికెట్లో రాణించే వారి సంగతి చెప్పనక్కరలేదు. ఓ వైపు ఆట, మరోవైపు యాడ్స్ తో బిజీబిజీగా గడుపుతుంటారు. క్రికెటర్లను సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ వారిని అభిమానిస్తుంటారు. కొందరైతే ఏకంగా క్రికెటర్లతో ప్రేమలో పడుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన మనసులోని మాట బయటపెట్టింది.

తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని తాను ఒకప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించినట్లు చెప్పింది. తన సోదరుడికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని అలా తాను కూడా క్రికెట్‌ చూడటం, తర్వాత ఇష్టపడడం మొదలుపెట్టి.. ఆ క్రమంలో కోహ్లీ ఆట చూసి ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది. కోహ్లీతో కలిసి ప్రత్యేక్షంగా మ్యాచ్ ని చూసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న హిందీ రీమేక్ జెర్సీ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని మృణాల్ తెలిపారు. కాగా తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మృణాల్ ఈ విషయాలను వెల్లడించారు.