ధోనీ ఇప్పుడు రిటైర్ అవ్వడానికి కారణం ఇదేనా?

  • Published By: vamsi ,Published On : August 16, 2020 / 07:16 AM IST
ధోనీ ఇప్పుడు రిటైర్ అవ్వడానికి కారణం ఇదేనా?

Updated On : August 16, 2020 / 7:37 AM IST

కోట్ల మంది భారతీయుల ఆశలను నెరవేర్చి టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అత్యంత విజయవంతమైన సారథి మహీ షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వరల్డ్ కప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగాలని భావించాడు. ఆ గెలుపుతో క్రికెట్ జీవితం నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అతను కోరుకున్నాడు.



అయితే కరోనా వల్ల టీ20 వరల్డ్‌ కప్‌ వాయిదా పడటం, ఇప్పట్లో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లో తలపడే అవకాశాలు లేకపోవడంతో ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్‌ 19న ఐపీఎల్‌-13 సీజన్‌ ఆరంభం కాబోతుండటంతో స్వేచ్ఛగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా జట్టుకు మరోసారి టైటిల్‌ సాధించిపెట్టాలని ధోనీ భావిస్తున్నాడు.



ఇదే క్రమంలో ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ధోనీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలను సెలక్టర్లు పరిగణిస్తారని, కుర్రాళ్ల కోసం ధోనీ తన స్థానం నుంచి తప్పుకోవాలని కొద్దిరోజులుగా క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నారు.