ధోనీ వచ్చేస్తున్నాడు: ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ధోనీ

వరల్డ్ కప్ 2019 న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రనౌట్ తర్వాత ధోనీ మైదానంలోకి రాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన ధోనీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
నెట్స్ లో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. వెస్టిండీస్‌తో టూర్ దగ్గర్నుంచి భారత జట్టుకు అందుబాటులో లేడు ధోనీ. ఆర్మీ ప్రాక్టీస్ క్యాంపుకు వెళ్లిన ధోనీ గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సిరీస్‌కు యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అడిగినందుకు ఒప్పుకున్న ధోనీ సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ పర్యటన నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లు పూర్తయ్యాక భారత్ కు రానున్న వెస్టిండీస్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా పూర్తి ఫిట్ నెస్ తో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికైన గంగూలీ కూడా చాంపియన్స్ దేనిని త్వరగా పూర్తి చెయ్యరని ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.
.@msdhoni’s first net session after a long long break.
Retweet if you can’t wait to see him back!??#Dhoni #MSDhoni #Ranchi #JSCA pic.twitter.com/2X6kbQNYMG
— MS Dhoni Fans Official (@msdfansofficial) November 15, 2019