పంత్ వార్నింగ్: మహీ భాయ్ రెడీగా ఉండు..

పంత్ వార్నింగ్: మహీ భాయ్ రెడీగా ఉండు..

Updated On : February 23, 2019 / 11:35 AM IST

21ఏళ్ల రిషబ్ పంత్.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఐపీఎల్ 2018 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఆడి వీర బాదుడుతో మెప్పించాడు. ఇప్పుడు 2019 ఐపీఎల్ సీజన్‌లో రాణించేందుకు మరోసారి సిద్ధమైపోయాడు. ఇటీవల టీమిండియాలో వరుస మ్యాచ్‌లు ఆడుతూ ధోనీ నుంచి సలహాలు తీసుకుంటున్న పంత్.. ధోనీకే పోటీ ఇస్తానంటున్నాడు. 

ఐపీఎల్ ప్రమోషనల్ యాడ్‌లో భాగంగా పంత్ ఓ వీడియోలో ఇలా మాట్లాడాడు. ‘మహీ భాయ్.. అన్నీ నీ దగ్గర్నుంచే నేర్చుకున్నా.. ఇప్పుడు నీకు పోటీగా ఆడేందుకు సిద్ధమవుతున్నా. వీవో ఐపీఎల్ లో కలుసుకుందాం. ఏమంటావ్.. ‘ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 
Read Also: వైజాగ్‌‌కు క్రికెట్ ఫీవర్ : ఆసీస్‌-భారత్‌ ఫస్ట్ టీ20 ఫైట్

గతేడాది జరిగిన ఐపీఎల్‌లో పంత్ దూకుడు చూసే టీమిండియా ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లలో అవకాశమిచ్చింది. చేతి వేలికి గాయం కారణంగా ఢిల్లీ జట్టుకు సాహా దూరమవడంతో ఆ స్థానంలోకి వచ్చిన పంత్.. జట్టు జయపజయాలకు అతీతంగా రెచ్చిపోయాడు. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నా.. కెప్టెన్లు మారిపోతున్నా తన స్టైల్‌లో రెచ్చిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అసాధారణ ప్రతిభతో మెప్పిస్తుండటంతో వరల్డ్ కప్ జట్టులోనూ తీసుకుంటే బాగా రాణిస్తాడని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 

Read Also: షూటింగ్‌లో ఇండియా జయహో: గురి పెట్టి కొడితే గోల్డ్ మెడల్ వచ్చింది