తొలి టీ20 ముందు ఆసీస్‌కు ధోనీ వార్నింగ్

తొలి టీ20 ముందు ఆసీస్‌కు ధోనీ వార్నింగ్

Updated On : February 23, 2019 / 12:57 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్‌తో టీ20 పోరుకు ముందు సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తాను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఫిబ్రవరి 24నుంచి సొంతగడ్డపై తలపడనున్న భారత్‌కు వైజాగ్ వేదిక కానుంది. 

తొలి టీ20ని వైజాగ్‌లో, రెండో టీ20ని బెంగళూరులో ఆడేందుకు సిద్ధమవుతోన్న టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ .. ‘ధోనీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆసీస్‌ పాలిట సింహస్వప్నంలా మారనున్నాడు’ అంటూ వీడియో పెట్టింది. 

ఏడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్న భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన 2 టీ20లు, 5 వన్డేలుగా జరగనుంది. ఈ మ్యాచ్‌లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలు ఆసీస్‌తో మ్యాచ్‌లు వరల్డ్ కప్ జట్టు కూర్పుకు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.