విరాట్ కోహ్లీ వివాదాస్పద ఔట్ పై నవజ్యోత్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

కోహ్లీ అవుట్ అయిన విధానం గురించి సిధ్ధూ మాట్లాడారు. నేను ఛాతికొట్టుకొని బలంగా చెప్పగలను.. విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ వివాదాస్పద ఔట్ పై నవజ్యోత్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

navjot singh sidhu

Navjot Singh Sidhu : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదంగా మారింది. నోబాల్ విషయంలో అంపైర్ తో కోహ్లీ వాగ్వివాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన ఛాతిని కొట్టి నాట్ అవుట్ అని చెబుతా అంటూ సిద్ధూ తెలిపాడు. బంతి బ్యాట్ కు తగిలినప్పుడు అది సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉందని చెప్పాడు.

Also Read : IPL 2024 : నో బాల్ విషయంలో అంపైర్‌తో కోహ్లీ గొడవ.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదంకు దారితీసింది. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్ తొలి బంతికే ఫుల్ టాస్ బౌల్ చేశాడు. కోహ్లీ బ్యాట్ కు తగలడంతో బంతి గాలిలోకి దూసుకెళ్లింది. హర్షిత్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే, అది నో బాల్ అని భావించిన కోహ్లీ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. కానీ థర్డ్ అంపైర్ రీప్లేలో చూసిన తరువాత కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని ఔటిచ్చాడు. నేలపై నుంచి కోహ్లీ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా.. అతను ఆడినప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులోనే ఉందని సాంకేతిక సాయంతో అంపైర్ నిర్ణయించాడు.

Also Read : Rohit Sharma : రోహిత్ శ‌ర్మ చెప్పాక చేసేదేముంది..! ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌లో మార్పుల‌కు బీసీసీఐ క‌స‌ర‌త్తులు..?

కోహ్లీ అవుట్ అయిన విధానం గురించి సిధ్ధూ మాట్లాడారు. నేను ఛాతికొట్టుకొని బలంగా చెప్పగలను.. విరాట్ కోహ్లీ నాటౌట్ అని. బంతి బ్యాట్ ను తాకినప్పుడు అది కనీసం ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. కోహ్లీ విషయంలో అంపైర్ నిర్ణయం ఆటతీరును మార్చేసింది. ఇదిలాఉంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఒక్క పరుగులు తేడాతో ఓడిపోయింది. లాస్ట్ బాల్ కు మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. రెండో పరుగు తీసే సమయంలో సిరాజ్ రనౌట్ అయ్యాడు. తాజా ఓటమితో బెంగళూరు జట్టు ఐపీఎల్ లో మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లలో ఓడిపోయినట్లయింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను చేజార్చుకుంది.