IND vs NZ 3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ .. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు
మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింది.

india vs new zealand
IND vs NZ 3rd ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే ఇండోర్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టీమిండియాలో తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టులో ప్రధాన బౌలర్లుగా ఉన్న మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజుద్దీన్లకు టీమిండియా విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో పాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహెల్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది.
న్యూజిలాండ్ జట్టు మూడో వన్డేకు తుది జట్టులో ఒక్క మార్పు చేసింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్ జట్టు రెండు మ్యాచ్ లను గెలుచుకొని సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు పట్టుదలతో ఉంది. న్యూజిలాండ్ మూడో వన్డేలో విజయం సాధించి క్లీన్ స్వీప్ గండం నుంచి బయటపడేలా పోరాటం చేసేందుకు సిద్ధమైంది.
https://twitter.com/BCCI/status/1617789464864231424?cxt=HHwWgMDQ6cy8xfMsAAAA
టీమిండియా తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హార్ధిక్ పటేల్, వాసింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ తుది జట్టు..
ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్
https://twitter.com/BCCI/status/1617789236715081729?cxt=HHwWgsDS_aivxfMsAAAA