Babar Azam: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేళ.. బాబర్ అజామ్ కామెంట్స్
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మ్యాచులో తమకు బాగా మద్దతు లభించిందని చెప్పాడు. అలాగే...

Babar Azam
ODI World Cup 2023: ప్రపంచ కప్-2023లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండడంతో దీనిపై పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. తమ జట్టులో ఉన్న పరిస్థితులపై ఆయన వివరించి చెప్పాడు.
‘గతం గతః వర్తమానంపైనే నేను దృష్టి సారించడానికి ప్రయత్నిస్తున్నాను. బద్దలు కొట్టడానికే రికార్డులు ఉంటాయి. నా జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మొదటి రెండు మ్యాచుల్లో మేము బాగా ఆడాము. ఈ ఫాంనే కొనసాగిస్తామని ఆశిస్తున్నాం.
మ్యాచ్ కన్నా.. ఇటువంటి పెద్ద మ్యాచుకు టికెట్లు ఇవ్వడంలోనే అధిక ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచు జరుగుతున్న వేళ మాపై ఒత్తిడి లేదు. టీమిండియా-భారత్ చాలా సార్లు మ్యాచులు ఆడాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మ్యాచులో మాకు బాగా మద్దతు లభించింది.
అహ్మదాబాద్ లోనూ అదే జరుగుతుందని ఆశిస్తున్నాం. టీమ్‌గా మేము బ్యాటింగ్, బౌలింగ్ లో ఉత్తమ ప్రదర్శన ఎలా ఇస్తామన్నదే ముఖ్యం. సమర్థంగా ఆడడానికి అనుభవం బాగా ఉపయోగపడుతుంది. అంతగా అనుభవం లేని సమయంలో నేను కూడా భయపడేవాడిని. అయితే, దాని నుంచి బయటపడేయడానికి సీనియర్లు ఉంటారు.. వారు సాయపడతారు’ అని బాబర్ అజామ్ అన్నాడు. కాగా, గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
Fans are rallying behind the squad! Hear their messages for the boys ???#INDvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/EhZnCdFS1F
— Pakistan Cricket (@TheRealPCB) October 13, 2023