భువి వచ్చేశాడు : విండీతో వన్డే, టీ 20 సిరీస్ జట్ల ప్రకటన

రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వలేదు అలాగని ఫామ్‌లో లేని శిఖర్ ధావన్‌నూ తప్పించలేదు. ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండానే..వెస్టిండీస్‌తో వన్డే, టీ 20 సిరీస్‌లకు జట్లను ప్రకటించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమైంది. గాయం నుంచి కోలుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు.
కుల్దీప్ యాదవ్‌కు టీ 20లో చోటిచ్చారు. బంగ్లాతో టీ 20లు ఆడదిన ఆల్ రౌండర్ పాండ్యా, పేసర్ ఖలీల్ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. వీరితో పాటు సంజూ సామ్సన్, రాహుల్ చాహర్‌లను తప్పించారు. వీళ్లిద్దరినీ బంగ్లాతో జరిగిన టీ 20లకు తీసుకున్నా..ఆడే అవకాశం కల్పించలేదు. పేసర్ షమీని టీ 20లకు ఎంపిక చేశారు. స్పిన్నర్ రవీంద్ర జడేజాను తీసుకున్నారు. శివమ్ దూబేకు వన్డేల్లో చోటు కల్పించారు. ఇతను బంగ్లా టీ 20లో మంచి ఆటతీరును కనబర్చాడు. త్వరలో భారతయ పర్యటనకు వచ్చే వెస్టిండీస్ తో కోహ్లీ సేన మూడు టీ 20లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 06న ముంబైలో ఇరు జట్ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగనుంది.
వన్డే జట్టు : కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, కె.ఎల్. రాహుల్, శ్రేయస్, మనీశ్ పాండే, పంత్, శివమ్ దూబే, కేదార్, జడేజా, చహల్, కుల్దీప్, దీపక్ చాహర్, షమీ, భువనేశ్వర్
టీ 20 జట్టు : కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, కె.ఎల్. రాహుల్, శ్రేయస్, మనీశ్ పాండే, పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జడేజా, చహల్, కుల్దీప్, దీపక్ చాహర్, షమీ, భువనేశ్వర్