LSG vs GT : ఫ్యాన్ తల పగలకొట్టిన నికోలస్ పూరన్.. ఇదేం పిచ్చి రా అయ్యా.. బ్యాండేజీతోనే..
లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. శనివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (60; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సాయి సుదర్శన్ (56; 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్, దిగ్వేష్ రతి లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Abhishek Sharma : ఏం అదృష్టం బ్రో.. నక్కతోక తొక్కివచ్చావా ఏందీ..!
అనంతరం లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (61; 34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు), ఐడెన్ మార్‌క్రమ్ (58; 31 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్)లు మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లు చెరో వికెట్ పడగొట్టారు.
ఫ్యాన్స్ తలకు తగిలిన బంతి..
ఈ సీజన్‌లో నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ తో మ్యాచ్‌లోనూ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 34 బంతులను ఎదుర్కొన్న అతడు ఓ ఫోర్, 7 సిక్సర్లు బాది 61 పరుగులు చేశాడు. అతడి కొట్టిన సిక్సర్లలో ఓ సిక్స్ స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను చూస్తున్న అభిమాని తలకు బలంగా తగిలింది. దీంతో అతడి తలకు గాయమైంది. రక్తం కూడా కారింది. వెంటనే మైదాన సిబ్బంది, వైద్య సిబ్బంది అతడికి ఫస్ట్ ఎయిట్ చేసి బ్యాండేజ్ వేశారు.
One of Nicholas Pooran’s sixes hit a spectator in the head.
– The guy wanted to watch the match again after getting the treatment. pic.twitter.com/LFHTCshg9j
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025
ఆ తరువాత అతడిని ఇంటికి వెళ్లమని అక్కడ ఉన్న వారు, వైద్య సిబ్బంది అతడికి సూచించారు. అయితే.. సదరు ఫ్యాన్ మాత్రం క్రికెట్ పై తనకు ఉన్న పిచ్చిని చాటుకున్నాడు. నొప్పి వేధిస్తున్నా, తలకు బ్యాండేజీతోనే మ్యాచ్ పూర్తి అయ్యే వరకు చూసి గానీ అతడు మైదానాన్ని వీడలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.