Champions Trophy: రూటు మార్చిన పాకిస్థాన్ క్రికెటర్.. మొన్ననేమో అలా.. ఇప్పుడేమో కోహ్లీ గురించి..
దీంతో అప్పట్లో అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు.

Kohli
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచులో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను బౌల్డ్ చేసిన పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సైగలు చేయడంతో అందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. దీంతో అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఆ మ్యాచ్ తర్వాత అబ్రార్‌ను టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు.

Abrar Ahmed
ఇప్పుడు కోహ్లీ తన చిన్ననాటి హీరో అంటే అబ్రార్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తన చిన్నప్పటి హీరో అయిన కోహ్లీకి బౌలింగ్ చేసే ఛాన్స్ తనకు దక్కిందని అన్నాడు. కోహ్లీ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే క్రికెటర్‌గా ఉంటాడని, పర్సనల్‌గా మంచివాడని తెలిపాడు. కోహ్లీ మైదానంలోనే కాక, బయట కూడా అందరిలో స్ఫూర్తిని నింపడంలో ముందుంటాడని, ఇదే అతడి గొప్పందమని చెప్పాడు.
Also Read: బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ స్పిన్నర్ ఛాలెంజ్.. ఏమన్నారో తెలుసా?
కాగా, దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించిన విషయం విదితమే. ఈ మ్యాచులో కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. తిరిగి ఫామ్‌లోకి రావడంతో సెమీఫైనల్స్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కోహ్లీ ఈ మ్యాచు ద్వారా పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు.
కోహ్లీ తన వన్డే కెరీర్‌లో ఆదివారం 300వ మ్యాచ్ ఆడుతున్నాడు. లీగ్ స్టేజ్‌లో భారత్, న్యూజిలాండ్‌కు ఇది ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ చూడడానికి అతడి భార్య అనుష్క శర్మ వస్తోంది. కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం.