వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ జట్టు ప్రకటన, అమీర్‌కు మొండిచేయి

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మే 23నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధం కావడంతో 15మంది కూడిన జట్టును విడుదల చేసింది. ప్రపంచ కప్‌లో ఆడాలని ఎన్నో కలలు కన్న మొహమ్మద్ అమీర్‌కు మొండిచేయి చూపించారు సెలక్టర్లు.
పాకిస్తాన్ ఫేసర్ మొహమ్మద్ అమీర్ ఫామ్‌లో లేకపోవడంతో 15మంది ప్లేయర్లలో స్థానం దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో టీనేజర్ మొహమ్మద్ హస్నైన్ ను జట్టులోకి తీసుకున్నారు. ఛీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ జట్టును ప్రకటించి వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చాడు.
Also Read : ధోనీ లేని సూపర్ కింగ్స్.. ఆర్సీబీ లాంటిది
సెలక్టర్ ఇంజమామ్ మాట్లాడుతూ.. జట్టు సమతూకంగా ఉందని వరల్డ్ కప్ విజేతగా నిలిచేందుకు అర్హతలున్న జట్టు అని కొనియాడాడు.
15మంది సభ్యులున్న పాకిస్తాన్ జట్టు:
సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫఖార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజాం, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, ఫహీం అష్రఫ్, షహీన్ అఫ్రీది, హస్సన్ అలీ, అబిడ్ అలీ, మొహమ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, జునైద్ ఖాన్, మొహమ్మద్ హస్నైన్, హారిస్ సొహైల్
పాక్ షెడ్యూల్:
మే 24 – అఫ్గనిస్తాన్‌తో (వార్మప్), బ్రిస్టల్
మే 26 – బంగ్లాదేశ్‌తో (వార్మప్), కార్డిఫ్
మే31 – వెస్డిండీస్‍తో , ట్రెంట్ బ్రిడ్జ్
జూన్ 03 – ఇంగ్లాండ్‌తో, ట్రెంట్ బ్రిడ్జ్
జూన్ 07 – శ్రీలంకతో, బ్రిస్టల్
జూన్ 12 – ఆస్ట్రేలియాతో, టాన్టన్
జూన్ 16 – భారత్‍తో, ఓల్డ్ ట్రాఫర్డ్
జూన్ 23 – దక్షిణాఫ్రికాతో, లార్డ్స్
జూన్ 26 – న్యూజిలాండ్‌తో, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 29 – అఫ్గనిస్తాన్‌తో, హెడీంగ్లీ
జూన్ 05 – బంగ్లాదేశ్‌తో, లార్డ్స్