IND vs IRE : భార‌త్‌తో త‌ల‌ప‌డే ఐర్లాండ్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే..?

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ఐర్లాండ్ (Ireland) ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా(Team India)తో త‌ల‌ప‌డే ఐర్లాండ్ జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.

IND vs IRE : భార‌త్‌తో త‌ల‌ప‌డే ఐర్లాండ్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే..?

Ireland Team

Updated On : August 4, 2023 / 8:12 PM IST

India vs Ireland :వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ఐర్లాండ్ (Ireland) ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా(Team India)తో త‌ల‌ప‌డే ఐర్లాండ్ జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. మొత్తం 15 మందికి జ‌ట్టులో చోటు ఇచ్చింది. పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) నాయ‌క‌త్వంలో ఐర్లాండ్ బ‌రిలోకి దిగ‌నుంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఆగ‌స్టు 18న డ‌బ్లిన్ వేదిక‌గా భార‌త్‌, ఐర్లాండ్‌లు మొద‌టి టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

స్కాట్లాండ్ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీ ద్వారా 2024 టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు ఐర్లాండ్ అర్హ‌త సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ టోర్నీలో ఆడిన ఆట‌గాళ్ల‌తోనే దాదాపుగా జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఆల్‌రౌండ‌ర్ ఫియోన్ హ్యాండ్‌కు చోటు ద‌క్కింది. గాయం నుంచి కోలుకున్న గారెత్ డెలానీని ఎంపిక చేసింది.

IND vs WI : ఐసీసీ షాక్‌.. గెలిచిన వెస్టిండీస్‌కు 10, ఓడిన టీమిండియాకు 5 శాతం జ‌రిమానా.. ఎందుకో తెలుసా..?

ఐర్లాండ్ జ‌ట్టు : పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్‌ వైట్‌, క్రెయిగ్ యంగ్

బుమ్రా నాయ‌క‌త్వంలో భార‌త్‌..

ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న కోసం ఇప్ప‌టికే బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. గాయం నుంచి కోలుకున్న బుమ్రా పున‌రాగ‌మ‌నం చేయ‌నున్నాడు. అత‌డి సారథ్యంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన‌ రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ వంటి ఆట‌గాళ్ల‌కు తొలిసారి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది.

RCB : క‌ప్పులు గెలిపించే కోచ్ వ‌చ్చాడు.. ఆర్‌సీబీ రాత మారుస్తాడా..?

భారత జట్టు : జ‌స్ ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్