BCCI vs PCB: బీసీసీఐ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించిన పీసీబీ.. అఫ్రీది రియాక్షన్ ఏమిటంటే?

జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంది. కానీ, జేషా ఏడాది ముందుగానే ఈ ప్రకటన చేయడం పట్ల పీసీబీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

BCCI vs PCB: బీసీసీఐ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించిన పీసీబీ.. అఫ్రీది రియాక్షన్ ఏమిటంటే?

bcci vs pcb

Updated On : October 19, 2022 / 8:46 AM IST

BCCI vs PCB: వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో 50 ఓవర్ల ఆసియా కప్-2023 టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి భారత్ జట్టు హాజరవుతుందా అన్న అంశం ఆసక్తికరంగా మారినవేళ.. బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మంగళవారం బీసీసీఐ వార్షిక జనరల్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చజరిగిన అనంతరం.. ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు జైషా బోర్డు నిర్ణయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ లో భారత్ జట్టు పాల్గొనదని, ఆసియా కప్ తటస్థ వేదికలోనే ఆడాలని నిర్ణయించినట్లు జైషా కుండబద్దలు కొట్టాడు. బీసీసీఐ నిర్ణయం పట్ల పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు.

Asia Cup 2023 : భారత్ పాకిస్తాన్‌కు వెళ్లదు.. పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బిగ్ షాక్

బీసీసీఐ ప్రకటన తర్వాత భారతదేశంలో జరిగే 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచ కప్ నుండి వైదొలగాలని పీసీబీ ఆలోచిస్తోందని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ బహుళ జట్టు ఈవెంట్లలో పాకిస్తాన్ భారత్‌తో ఆడకపోతే ఐసీసీ, ఏసీసీ ఈవెంట్ల వాణిజ్య బాధ్యతలు తీసుకున్నవారు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ క్రమంలో పీసీబీ సైతం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతుందని సీనియర్ పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. పాకిస్తాన్ చివరిసారిగా 2012లో ఆరు మ్యాచ్‌ల వైట్‌బాల్ ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది.

Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్-2023 టోర్నీ.. టీమిండియా పాల్గొంటుందా.. బీసీసీఐ ఏమన్నదంటే?

షా చేసిన ప్రకటనపై పీసీబీ చైర్మన్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగడానికి ఇంకా దాదాపు ఒక సంవత్సరం సమయం ఉంది. కానీ, జే షా ఏడాది ముందుగానే ఈ ప్రకటన చేయడాన్ని పీసీబీ అధికారులు ఆశ్చర్యపోయారని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు షా ప్రకటనపై చర్చించేందుకు వచ్చే నెలలో మెల్‌బోర్న్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏసీసీకి లేఖ రాసేందుకు రాజా సిద్ధమైనట్లు పీసీబీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

జైషా చేసిన తాజా ప్రకటన పట్ల పాక్ క్రికెటర్ అఫ్రీది ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టు చేశారు. ‘గత 12 నెలల్లో రెండు దేశాల మధ్య మంచి అనుభూతిని కలిగించే అద్భుతమైన సహృదయ వాతావరణం ఏర్పడింది. అలాంటప్పుడు టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ఈ ప్రకటన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. ఈ ప్రకటన ద్వారా భారతదేశంలో క్రికెట్ పరిపాలన అనుభవం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందని అఫ్రీది పేర్కొన్నాడు.