India Beat West Indies: ప్రసిద్ధ్ కృష్ణ పవర్‌ఫుల్ బౌలింగ్.. రెండో వన్డేలో భారత్ విజయం
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.

Prasiddh Krishna
India Beat West Indies: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
అహ్మదాబాద్ వేదికగా వెస్డిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 237 పరుగులు చేసింది. అనంతరం 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 46 ఓవర్లలోనే 193 పరుగులకు ఆలౌట్ చేసింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది.
భారత్ విజయంలో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి, తర్వాత ఓవర్‌ను వికెట్ మెయిడెన్‌గా ముగించాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా పుంజుకొని సత్తా చాటారు. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ ఫినిష్ ఇచ్చాడు. మూడు మెయిడిన్లతో 9 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్.
Sumanth : ఇప్పుడు విడాకులు అనేవి కామన్.. విడాకులపై హీరో సుమంత్ వ్యాఖ్యలు..
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్‌కూ వికెట్ దక్కింది. దీపక్ హుడా కూడా కీలక వికెట్ తీశాడు. భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్, పంత్, కోహ్లీ వంటి కీలక ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు.
UP Election 2022: ప్రారంభమైన యూపీ ఎన్నికల పోలింగ్.. బరిలో 623 మంది అభ్యర్థులు