Rahul Dravid : టీమ్​ ఇండియాతో శ్రీలంక సిరీస్..కోచ్ గా ద్రవిడ్

శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్‌, నేష‌నల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) చైర్మ‌న్ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యవహరించ‌నున్నారు.

Rahul Dravid : టీమ్​ ఇండియాతో శ్రీలంక సిరీస్..కోచ్ గా ద్రవిడ్

Srilanka

Updated On : May 20, 2021 / 1:54 PM IST

Team India : శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్‌, నేష‌నల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) చైర్మ‌న్ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యవహరించ‌నున్నారు. శ్రీలంక – భారత్ జట్లు ఇరు జ‌ట్లు ఆరు మ్యాచులు ఆడనున్నాయి. అయితే..శ్రీలంక..పర్యటన ఉండగానే…టీమిండియా…ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది.

ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో స‌హా కోచింగ్ బృందం టెస్ట్ జ‌ట్టుతో ఉండ‌నుంది. ఈ క్రమంలో.. శ్రీలంక‌కు వెళ్ల‌నున్న భార‌త జట్టుకు మరో కోచ్‌ అవసరం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న ద్ర‌విడ్‌ను కోచ్ గా ఎంపిక చేశారు. 2014 త‌ర్వాత ద్ర‌విడ్‌ టీమిండియా ప్ర‌ధాన జ‌ట్టుతో క‌లిసి ప‌ని చేయ‌డం ఫస్ట్ టైమ్. కానీ..ఈ సిరీస్ కోసం జట్టును ఇంకా సెలెక్ట్ చేయాల్సి ఉంది. టీమిండియా మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వ‌న్డే మ్యాచ్‌లు, మూడు టీ 20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Read More : Telangana Police: 21 వేల పోలీస్ కేసులు నమోదు