Mohammad shami : మహ్మద్ షమీ వచ్చేశాడు.. తిరిగి టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బౌలర్.. ఆకాశ్‌దీప్‌కు దక్కిన అవకాశం..

Mohammad shami : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మైదానంలోకి దిగేందుకు ..

Mohammad shami : మహ్మద్ షమీ వచ్చేశాడు.. తిరిగి టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బౌలర్.. ఆకాశ్‌దీప్‌కు దక్కిన అవకాశం..

Mohammad shami

Updated On : October 9, 2025 / 9:53 AM IST

Mohammad shami : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. వెస్టిండీస్ సిరీస్ కు దూరమై, ఆపై ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే జట్టుకు ఎంపిక కాకపోవడంతో అతని కెరీర్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. షమీకి ఇకపై క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావడమే బెటర్ అంటూ కొందరు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మహ్మద్ షమీ మళ్లీ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.

35ఏళ్ల భారత ఫాస్ట బౌలర్ మహ్మద్ షమీ 28 నెలలుగా టెస్టు మ్యాచ్ ఆడలేదు. కానీ, ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ కు తిరిగి రాబోతున్నాడు. రాబోయే రంజీ ట్రోఫీ 2025 కోసం బెంగాల్ జట్టు 17మంది సభ్యుల జట్టులో షమీ కూడా ఎంపికయ్యాడు. అతనితోపాటు ఆకాశ్ దీప్‌కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అభిమన్యు ఈశ్వరన్‌కు అప్పగించారు. వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

Also Read: IND vs WI: భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు.. టీమిండియా తుది జట్టులో ఆ ఇద్దరూ ఉంటారా..? పరుగుల వరద ఖాయం..

మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్ రాకతో బెంగాల్ జట్టు బలంగా కనిపిస్తోంది. షమీ 2023 జూన్ నెలలో భారతదేశం తరపున తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇటీవల అతను దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సీనియర్ పేసర్ కు భారత జట్టులోకి తిరిగి రావడం అంత సులభం కాదు. కానీ, ఐపీఎల్ లో కొనసాగాలంటే షమీ ఎక్కువ సంఖ్యలో దేశీ మ్యాచ్ లలో ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకోవటంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

మహ్మద్ షమీ ఇప్పటి వరకు టీమిండియా తరపున 64 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. 229 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ (రెడ్ బాల్) క్రికెట్లో షమీ 90 మ్యాచ్ లలో 340 వికెట్లు పడగొట్టాడు. అతను చివరిసారిగా 2023 జూన్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా జట్టులో ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షమీకి టెస్టు జట్టులో అవకాశం రాలేదు. ఇదిలాఉంటే.. అక్టోబర్ 15వ తేదీన ఉత్తరాఖండ్ జట్టుతో తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో గుజరాత్ జట్టుతో బెంగాల్ జట్టు తలపడనుంది.

బెంగాల్ పూర్తి రంజీ జట్టు..
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వైస్ కెప్టెన్), సుదీప్ కుమార్ ఘరామి, అనుస్తుప్ మజుందార్, సౌరభ్ కుమార్ సింగ్, సుదీప్ ఛటర్జీ, సుమంత్ గుప్తా, విశాల్ భాటి, సూరజ్ సింధు జైస్వాల్, షకీర్ హబీబ్ గాంధీ, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ఆకాశ్ దీప్, జుషాన్, పొరెల్ సఫీ, జుషాన్ ప్రసాద్ మరియు వికాస్ సింగ్.