రవిశాస్త్రి అరంగ్రేటం: 38 ఏళ్ల తర్వాత మొదలుపెట్టిన చోటికే..

రవిశాస్త్రి అరంగ్రేటం: 38 ఏళ్ల తర్వాత మొదలుపెట్టిన చోటికే..

Updated On : February 3, 2019 / 4:07 AM IST

కివీస్-భారత్‌ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లోని ఆఖరి పోరుకు రవి శాస్త్రి క్రికెట్ కెరీర్‌కు ప్రత్యేకత ఉంది. చివరి వన్డేకు వేదికగా మారిన వెల్లింగ్టన్‌లోనే రవిశాస్త్రి తన టెటస్టు అరంగ్రేటం చేశారు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య చివరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగా టీమిండియా ఇప్పటికే వెల్లింగ్టన్ చేరుకుంది. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశారు.

‘38 సంవత్సరాలు.. నేను 1981లో వెల్లింగ్టన్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం  చేశాను. మళ్లీ అదే ప్రదేశానికి మెన్‌ ఇన్‌ బ్లూగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసి వీడియో షేర్‌ చేశారు. శాస్త్రి టీమిండియా తరఫున 80 టెస్టుల్లో ఆడి 125 ఇన్నింగ్స్‌లో 151 వికెట్లు పడగొట్టారు. 150 వన్డే మ్యాచుల్లో 129 వికెట్లు తీయగలిగారు. 

కివీస్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో చివరి వన్డే ఆదివారం జరగనుంది. మరో 2 మ్యాచులు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను దక్కించుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లను నామమాత్రంగా ముగిస్తే చాలు.