Rishabh Pant : ఐపీఎల్లో ఊచకోత ఖాయం..! ప్రాక్టీస్ సెషన్లో రెచ్చిపోయిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ తన సత్తాను చాటుతున్నాడు. ఈ క్రమంలో పంత్ భారీ సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ సమయం దగ్గర పడుతోంది. ఈనెల 22 నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు క్రికెటర్లు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఐపీఎల్ లో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ సిక్సర్ల మోతకోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఐపీఎల్ 2024 సీజన్ లో మైదానంలోకి రాబోతున్నారు. చాలాకాలం తరువాత పంత్ ఐపీఎల్ లోకి తిరిగి వస్తుండటంతో అభిమానులుసైతం పంత్ బ్యాటింగ్ ను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే, ఐపీఎల్ మ్యాచ్ కు ముందే పంత్ ప్రాక్టీస్ సెషన్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : WPL 2024 : భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. ఆ బాల్ వెళ్లి ఎక్కడ తగిలిందో తెలుసా?.. వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకప్పటి కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలి, వీపుపై బలమైన గాయాలయ్యాయి. దీంతో వైద్యులు పంత్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. గత సంవత్సర కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నారు. ఈనెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఫిట్ నెస్, ఫామ్ లోకి వచ్చేందుకు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పంత్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
Also Read : Viral Video : బౌలర్‌పై వికెట్ కీపర్‌కు పగ? బాక్స్ బద్దలైందిగా!
ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ తన సత్తాను చాటుతున్నాడు. ఈ క్రమంలో పంత్ భారీ సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ లలో పంత్ దూకుడు చూసి ఈసారి ఐపీఎల్ లో పంత్ సిక్సర్ల మోత ఖాయమని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్ కు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగుతారా? పూర్వవైభవాన్ని కొనసాగిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
RISHABH PANT's ONE HANDED SIX. ?
– Pant is coming back….!!!!pic.twitter.com/XU96BzWNY4
— Johns. (@CricCrazyJohns) March 4, 2024