Viral Video : బౌలర్‌పై వికెట్ కీపర్‌కు పగ? బాక్స్ బద్దలైందిగా!
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.

Ex India Stars Commentary On Wicketkeeper's Terrible Run Out Attempt Viral
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కావాలని చేయకపోయినా కొన్ని వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేము. క్రికెట్ మైదానంలో చోటు చేసుకున్న అలాంటి ఓ వీడియోను మాజీ భారత ఆటగాడు ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బౌలర్ బంతిని వేయగా.. బ్యాటర్ షాట్ ఆడాడు. అయితే.. బాల్ బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్లను తాకుంది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు బ్యాటర్ ఎల్భీడబ్ల్యూగా ఔట్ అయ్యాడని అప్పీల్ చేశారు. ఈ లోపు బై రూపంలో ఓ పరుగు పూర్తి చేయాలని బ్యాటర్లు బావించి పరుగెత్తారు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ బాల్ అందుకుని బౌలర్ ఎండ్‌లోని వికెట్ల వైపు విసిరేశాడు. ఆ బాల్ కాస్త బౌలర్ ఎడమ పిర్రను బలంగా తాకుంది. దీంతో బౌలర్ నొప్పితో నొప్పితో విలవిలలాడిపోయాడు. అక్కడ రుద్దుకుంటూ ఉండడం వీడియోలో కనిపించింది. బ్యాటర్లు ఈజీగా సింగిల్ తీశారు.
రిటైర్‌మెంట్ హింట్ ఇచ్చిన ధోని? ‘కొత్త సీజన్-కొత్త పాత్ర’.. అంటూ పోస్ట్..
ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్న వివరాలు తెలియనప్పటికీ ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
బీసీసీఐ ఆలోచన అదేనేమో!
ఇదిలా ఉంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో లెగ్ స్పిన్నర్ అయిన చహల్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. దీనిపై ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి చహల్‌ను తొలగించడం అంటే సెలక్షన్ కమిటీ ఇతర ఎంపికలను పరిశీలిస్తోందన్నాడు. ‘బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్ పేర్లు లేకపోవడాన్ని అర్థం చేసుకోగలను. యూజీ చహల్ పేరు లేకపోవటం కొంత ఆశ్చర్యంగా ఉంది. దీపక్ హుడా కు కూడా చోటు దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే బీసీసీఐ వేరొక దిశలో చూస్తున్నారని ఇది సూచిస్తోంది.’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
Ranji Trophy : రహానే నాయకత్వంలో అదరగొట్టిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి..
??? #AakashVani #CricketTwitter pic.twitter.com/lN4rE7F2J7
— Aakash Chopra (@cricketaakash) March 4, 2024