ఐపీఎల్ మెగా వేలంలోకి రిషబ్ పంత్? ఢిల్లీ కెప్టెన్‌ను కొనాలనుకుంటున్న ఆర్సీబీ?
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా తమ జట్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.

Rishabh Pant
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఢిల్లీ ఫ్రాంచైజీకి మాత్రమే ఆడాడు. అయితే, ఇకపై ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించబోడని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్, ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ పదవి నుంచి సౌరవ్ గంగూలీ వైదొలిగారు. ఇప్పుడు ప్లేయింగ్ యూనిట్‌లోనూ కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
రిషబ్ పంత్ ఢిల్లీ టీమ్ నుంచి వైదొలిగితే అతడిని తీసుకోవాలని భావిస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు ముందుగా వినపడుతోంది. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా తమ జట్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రస్తుతం రిషబ్ పంత్ గురించి జరుగుతున్న ప్రచారానికి ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్త్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం పొంతన కుదరడం లేదు. తమ జట్టులోని కొందరిని రిటైన్ చేసుకుంటామని అన్నారు. రిషబ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని చెప్పారు. తమ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని అన్నారు.
వినేశ్ ఫొగాట్ పై సాక్షిమాలిక్ సంచలన ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే