UAEలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ సంగతేంటీ? బిసిసిఐ ఆందోళన!

  • Published By: vamsi ,Published On : September 4, 2020 / 07:14 AM IST
UAEలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ సంగతేంటీ? బిసిసిఐ ఆందోళన!

Updated On : September 4, 2020 / 9:52 AM IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో బుధవారం, గురువారం రెండు రోజుల్లో కొత్తగా దేశంలో 1,349 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐపిఎల్ జాబితా బయటకు రాకముందే పెరుగుతున్న కరోనా కేసులు బిసిసిఐ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.



గత 24 గంటలుగా అక్కడ 614 కొత్త కేసులు వచ్చినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 639 మంది కోలుకోగా.. UAEలో ఇప్పటివరకు 72,154 మందికి కరోనా పాజిటివ్ రాగా.. అందులో 62,668 మంది నయమయ్యారు.
https://10tv.in/coronavirus-updates-india-sees-record-83-thousand-covid-cases-in-24-hours/
గత 24 గంటల్లో యూఏఈ ఆరోగ్య శాఖ అందించిన సమాచారం మేరకు అక్కడ 735 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. మే 27 తరువాత, గత 100 రోజులలో, ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కాలేదు.



ఐపీఎల్ జాబితాను శుక్రవారం వెల్లడించవచ్చు. ఈ విషయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. ఐపీఎల్ ప్రారంభించడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, UAEలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య గురించి కూడా బిసిసిఐ ఆందోళన చెందుతోంది.