Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో ఒకే ఒక భారతీయుడు..
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా (53 నాటౌట్; 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబె (50; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం రోహిత్ శర్మ (76 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్ ; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి అందుకుంది.
ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అతడికి ఇది 20వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా మూడో ఆటగాడిగా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ 25 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకుని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్లు..
రోహిత్ శర్మ – 20 సార్లు
విరాట్ కోహ్లీ – 19 సార్లు
ఎంఎస్ ధోని -18 సార్లు
ఐపీఎల్‌లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లు..
ఏబీ డివిలియర్స్ -25 సార్లు
క్రిస్‌గేల్ – 22 సార్లు
రోహిత్ శర్మ – 20 సార్లు
విరాట్ కోహ్లీ – 19 సార్లు
డేవిడ్ వార్నర్ – 18 సార్లు
ఎంఎస్ ధోని – 18 సార్లు
ఐపీఎల్‌లో అత్యధి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా..
ఈ మ్యాచ్‌లో 76 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. శిఖర్ ధావన్ 6769 పరుగులు చేయగా.. చెన్నైతో మ్యాచ్‌తో కలిపి రోహిత్ శర్మ 6786 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8326 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ – 8326 పరుగులు
రోహిత్ శర్మ – 6786 పరుగులు
శిఖర్ ధావన్ – 6769 పరుగులు
డేవిడ్ వార్నర్ – 6565 పరుగులు
సురేశ్ రైనా – 5528 పరుగులు