Rohit Sharma: మా కొంపముంచింది అతడే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ ఇలాగే ఆడాలి
ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆరో సారి టైటిల్ అందుకోవాలని భావించిన రోహిత్ సేన శుక్రవారం క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలై లీగ్ నుంచి నిష్క్రమించింది.

Rohit Sharma comments GT vs MI match
Rohit Sharma-Shubman Gill: ఐపీఎల్(IPL) 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కథ ముగిసింది. ఆరో సారి టైటిల్ అందుకోవాలని భావించిన రోహిత్ సేన శుక్రవారం క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(129) భారీ శతకం చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 171 పరుగులకే ఆలౌటైంది. మోహిత్ శర్మ ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు.
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓడిపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, ముంబై బౌలర్లు 25 పరుగులు అదనంగా సమర్పించుకున్నారని చెప్పాడు. అయినప్పటికీ తాము పాజిటివ్‌గానే బరిలోకి దిగామన్నాడు. సూర్యకుమార్ యాదవ్(61), తిలక్ వర్మ(43), కామెరూన్ గ్రీన్(30) లు అద్భుతంగా ఆడినప్పటికి మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలం కావడం, పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం చేటు చేశాయని రోహిత్ అన్నాడు.
IPL2023: శుభ్‌మన్‌గిల్ మరో హ్యాట్రిక్.. రోహిత్, కోహ్లి వల్ల కూడా కాలేదు.. ఒక్క ధోనికి తప్ప..!
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ అద్భుతంగా ఆడాడని, క్రెడిట్ అతడికే దక్కుతుందని చెప్పాడు. గిల్ లాగా తమ జట్టులో ఒక్కరు అయినా చివరి వరకు ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఇషాన్ కిషన్ గాయపడడం మాకు నష్టం చేకూర్చింది. కంకషన్ తీసుకువచ్చినా ఉపయోగం లేకపోయిందని అన్నాడు. ఇక గిల్ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు.
పరోక్షంగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా శుభ్‌మన్ గిల్ భారీ స్కోరు సాధించాలని రోహిత్ ఆశిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధించినా సరే సరికొత్త ఛాంపియన్‌గా నిలవనున్నారు. మొదటి సారి న్యూజిలాండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
IPL 2023: ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిఉంటే రోహిత్ సేన విజయం సాధించేదా? అసలు ఇషాన్‌కు ఏమైంది..