Champions Trophy 2025: భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు..? రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.

Rohit Sharma
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. అయితే, దుబాయ్ పిచ్ ఎప్పుడూ స్పినర్స్ కు అనుకూలిస్తుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లోనూ స్పిన్నర్ల కు పిచ్ అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇరు జట్లూ ఆల్ రౌండర్లతో కలిపి ముగ్గురు చొప్పున స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ పిచ్ పై బ్యాటింగ్ అనుకున్నంత తేలిక కాదు.. అలాఅని మరీ కష్టంగానూ ఉండకపోవచ్చు. అయితే, భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు అంటూ వస్తున్న ప్రశ్నలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో బుధవారం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. అయితే, భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు అంటూ కొందరు మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీంతో రోహిత్ సమాధానమిస్తూ.. తమ బలాలకు అనుగుణంగానే జట్టును ఎంపిక చేసినట్లు చెప్పాడు.
జట్టులో ఉన్నది ఐదుగురు స్పిన్నర్లు అనే అంశాన్ని నేను పరిగణలోకి తీసుకోను. జట్టులో ఉంది ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే. మరో ముగ్గురు ఆల్ రౌండర్లు. వారిని మేము కేవలం స్పిన్నర్లుగానే చూడటం లేదు. వారు బ్యాట్ తోనూ బాల్ తోనూ రాణించగలరు. మేం మా బలాలాపై మాత్రమే ఫోకస్ పెట్టాం. అందుకు తగ్గట్టుగానే జట్టును నిర్మించాం. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు విభిన్నమైన డైమెన్షన్ అందిస్తారు. వారితో మా బ్యాటింగ్ బలం పెరుగుతుంది. అందుకే మేం బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను ఎంచుకున్నాం అంటూ రోహిత్ సమాధానం ఇచ్చారు.
Rohit Sharma said, “we’ve 3 spinners and 3 all-rounders. I don’t look at them as 5 spinners. Jadeja, Axar and Sundar give us a lot of depth with the bat”. pic.twitter.com/Ou4duJU0FE
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2025