Rohit Sharma: రోహిత్.. నీ పేరును ‘నో హిట్ శర్మ’ గా మార్చుకో.. కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పేరును మార్చుకోవాలని అన్నాడు. నో హిట్ శర్మ గా మార్చుకుంటే మంచిది అంటూ సూచించాడు.

Rohit should change his name to 'No Hit Sharma
Rohit Sharma: టీమ్ఇండియా సారధి, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను అభిమానులు అంతా ముద్దుగా హిట్ మ్యాన్(HIT MAN) అని పిలుచుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయడంలో విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓటములకు ఇదీ ఓ కారణంగా చెప్పవచ్చు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో సైతం రోహిత్ మరోసారి విఫలం అయ్యాడు.
రెగ్యులర్‌గా ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయినప్పటికి పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పేరును మార్చుకోవాలని అన్నాడు. ‘నో హిట్ శర్మ’ గా మార్చుకుంటే మంచిది అంటూ సూచించాడు.
Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు
ఇక్కడితో అతడు ఆగిపోలేదు. ప్రస్తుతం రోహిత్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం తాను అతడిని జట్టులోకి తీసుకునే వాడిని కాదంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు. ఫామ్ అనేది తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే రోహిత్ ఫామ్‌ను అందుకుని తనదైన శైలిలో చెలరేగుతాడన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Rohit Sharma
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 10 మ్యాచ్‌లు ఆడగా 184 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ రెండు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు(16) డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిటి లిఖించుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ తరువాత సునీల్ నరైన్, మన్‌దీప్ సింగ్, దినేశ్ కార్తిక్ లు తలా 15 సార్లు డకౌట్లు అయ్యారు.
Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు
మరో చెత్త రికార్డును సైతం రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా(11)గా నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయాని వస్తే.. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో నెహల్ వధేరా(64; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.