Sachin Tendulkar: సచిన్ హోలీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో వైరల్.. యువరాజ్, అంబటి రాయుడు, యూసుఫ్ ఫఠాన్..
హోలీ పండుగ వేళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. తొటి క్రికెటర్లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

Sachin Tendulkar Holi Celebration
Sachin Tendulkar Holi Celebration: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు రంగులు పూసుకుంటూ సందడి చేశారు. హోలీ పండుగ వేళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తోటి క్రికెటర్లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడులను రంగులతో ముంచెత్తుతూ సచిన్ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియోలో.. సచిన్ టెండూల్కర్ తన సహచర క్రికెటర్లతో కలిసి తొలుత యువరాజ్ రూమ్ వద్దకు వెళ్లారు. యువరాజ్ సింగ్ డోర్ తీయగానే సచిన్, ఇతర క్రికెటర్లు వాటర్ గన్స్ తో అతన్ని రంగులతో ముంచెత్తారు. ఆ తరువాత అంబటి రాయుడు రూమ్ వద్దకు వెళ్లిన సచిన్ గ్యాగ్ రాయుడిని రంగులతో తడిపేశారు. యూసుఫ్ పఠాన్ తోపాటు తోటి క్రికెటర్లపై రంగులు చల్లుతూ హోలీ వేడుకల్లో సచిన్ ఉత్సాహంగా పాల్గొన్నాడు.
Also Read: Hazratullah Zazai : అఫ్గాన్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం.. చనిపోయిన కూతురు..
సచిన్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో బిజీగా ఉన్నాడు. ఇండియా మాస్టర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో యువరాజ్, యూసఫ్ పఠాన్, రాయుడు కూడా ఉన్నారు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టు ఫైనల్ కు చేరింది. ఆదివారం ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు ఐఎంఎల్-2025 టైటిల్ కోసం తలపడనున్నాయి.
Sachin Tendulkar, Yuvraj Singh and Yusuf Pathan celebrating Holi. 😂👌 pic.twitter.com/PYEaMoNbHV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025