Champions Trophy 2025: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై షాహిద్‌ అఫ్రిదీ ఆసక్తికర కామెంట్స్‌

ఈ నెల 23న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడనుంది.

Champions Trophy 2025: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై షాహిద్‌ అఫ్రిదీ ఆసక్తికర కామెంట్స్‌

Shahid Afridi

Updated On : February 19, 2025 / 9:48 PM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 జరుగుతున్న వేళ మాజీ క్రికెటర్లు షాహిద్‌ అఫ్రిదీ, యువరాజ్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నాటి క్రికెటర్లు, నేటి క్రికెటర్ల గురించి మాట్లాడారు.

అప్పట్లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరిగితే ఆటగాళ్లు ఎంతో దూకుడుగా ఉండేవారని షాహిద్ అఫ్రిదీ చెప్పాడు. ఇప్పటి క్రికెటర్లు మాత్రం మెక్‌ డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ తరంలాంటి వారని చురకలు అంటించారు.

Also Read: ఆల్ టైమ్ గరిష్ఠానికి బంగారం ధరలు.. ఎందుకంటే? పసిడిని కొంటే మీ లక్కు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది..

ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ క్రికెటర్ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌.. భారత్‌, పాకిస్థాన్ మధ్యే ఈ గొడవ ఎందుకు ఉందని, అటువైపు శ్రీలంక- బంగ్లాదేశ్‌ ఉన్నాయని చెప్పారు. ఈ విరోధాలు ఎవరితోనైనా ఉండొచ్చని అన్నారు.

అప్పట్లో భారత్‌, పాకిస్థాన్‌ ఒకే దేశంగా ఉండేవని గుర్తుచేశారు. ఈ దేశాల మధ్య మంచి లవ్‌, ఎఫెక్షన్ ఉన్నాయని చెప్పారు. అసలు ఎంతగా ప్రేమ కురిపిస్తామో, అంతగా వైరాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

కాగా, టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచును బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇప్పటికే టీమిండియా దుబాయ్ చేరుకుంది. అక్కడి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో గురువారం తలపడుతుంది.

ఈ నెల 23న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇండియా ఆడే మ్యాచులు అన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి.