Shardul Thakur : శార్దూల్ ఠాకూర్‌కు తప్పిన ప్రమాదం..! కొంచమైతేనా..!
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.

Shardul Thakur
Shardul Thakurs brave innings : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో సఫారి పేసర్ వేసిన ఓ బంతి శార్దూల్ తలను బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. ట్రీట్‌మెంట్ అనంతరం ఆటను తిరిగి ప్రారంభించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
భారత ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 44వ ఓవర్‌ను గెరాల్డ్ కోయెట్జీ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతి శార్దూల్ ఠాకూర్ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఠాకూర్ నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బంతి తగిలిన చోట ఐస్‌బ్యాగ్‌ను కొద్ది సేపు ఉంచారు. అక్కడ వాపు కనిపించింది. అతడి హెల్మెట్‌ను సైతం మార్చారు. ట్రీట్‌మెంట్ అనంతరం శార్దూల్ బ్యాటింగ్ కొనసాగించాడు.
అయితే.. 47 ఓవర్‌లో మరోసారి శార్దూల్ గాయపడ్డాడు. రబాడ విసిరిన బంతి అతడి కుడి చేతిని తాకింది. నొప్పితో బాధపడడంతో మళ్లీ ఫిజియో మైదానంలోకి వచ్చాడు. చికిత్స తరువాత శార్దూల్ బ్యాటింగ్ కొనసాగించాడు. మరో రెండు బంతులకే ఔట్ అయ్యాడు. మొత్తంగా శార్దూల్ 33 బంతులు ఆడి 24 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు ఉన్నాయి.
శతకం దిశగా కేఎల్ రాహుల్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు 59 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కేఎల్ రాహుల్ (70), మహ్మద్ సిరాజ్ (0)లు క్రీజులో ఉన్నారు. విరాట్ కోహ్లి (38), శ్రేయస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) లు ఓ మోస్తరుగా రాణించారు.
IND vs SA 1st test : టాస్ ఓడిపోయినందుకు ఆనందపడ్డ రోహిత్ శర్మ..! జడేజా ఎందుకు ఆడడం లేదంటే..?
యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (2)లు విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ ఐదు వికెట్లతో భారత వెన్ను విరచగా నండ్రీ బర్గర్ రెండు, మార్కో జాన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు కేఎల్ రాహుల్ ఎంత సేపు క్రీజులో ఉంటాడో అన్న దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.
Shardul Thakur – THE FIGHTER ??#WhistlePodu #IPL2024 #INDvsSA pic.twitter.com/xC35jC1phn
— CSK Fans Army™ (@CSKFansArmy) December 26, 2023