Mohammed Siraj : చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. చమిందా వాస్ రికార్డు సమం
తెలుగు తేజం, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా తరుపున వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు

Mohammed Siraj
Mohammed Siraj Record : తెలుగు తేజం, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా తరుపున వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు. కేవలం 16 బంతుల్లోనే సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో ఓ వన్డే మ్యాచులో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడి రికార్డు శ్రీలంక ఆటగాడు ప్లేయర్ చమిందా వాస్ పేరిట ఉంది. 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ కూడా 16 బంతుల్లోనే ఐదు వికెట్లను తీశాడు. దీంతో ఇప్పుడు అతడి రికార్డును సిరాజ్ సమం చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మహ్మద్ సిరాజ్ తన రెండో ఓవర్లో విశ్వరూపం చూపించాడు. ఓకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. మొదటి బంతికి పాథుమ్ నిశాంక (2; 4 బంతుల్లో) ను ఔట్ చేయగా మూడో బంతికి సదీరా సమరవిక్రమ(0)ను ఎల్భీ డబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగో బంతికి అసలంక (1) ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. ఐదో బంతిని ఫోర్‌గా మలిచిన ధనుంజయ డిసిల్వా (4) ఆఖరి బంతికి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 12 పరుగులు మాత్రమే చేసింది.
పాంచ్ పటాకా..
అక్కడితోనే సిరాజ్ ఆగిపోలేదు. తన తరువాతి ఓవర్లోనూ లంక కెప్టెన్ దసున్ షనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. కేవలం 16 బంతుల్లోనే 29 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ పేసర్ ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు.
Pakistan Team: పాక్ జట్టులో బయటపడ్డ విబేధాలు.. బాబర్, షాహీన్ అఫ్రిది మధ్య గొడవ