సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్: రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు

సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్: రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు

ఐపీఎల్ 12 వచ్చేసింది.. మరికొన్ని రోజుల్లో.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రికెట్ క్రీడా సంరంభం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 23నుంచి చెన్నైలో జరగనున్న తొలి మ్యాచ్‌తో సీజన్‌ను ఆరంభించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేసిన ఫ్రాంచైజీలు ఎప్పటికప్పుడు అభిమానుల ముందుకు సరికొత్తగా వచ్చేందుకు ప్రయత్నిస్తాయి. మార్చి 29న తొలి మ్యాచ్‌లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వినూత్న పద్ధతిలో ప్రచారం మొదలుపెట్టింది.
Read Also : హాస్పిటల్‌లో చేరిన సన్‌రైజర్స్ కెప్టెన్

25వేల సీట్ల కెపాసిటీ ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు టిక్కెట్ల ధరను ప్రకటించింది. మార్చి 13 ఉదయం 11గంటల నుంచి టిక్కెట్ల అమ్మకం ప్రారంభించనుండగా ముందుగా టిక్కెట్ కొనుక్కున్న వారికీ రూ.500కే టిక్కెట్ అమ్ముతున్నట్లు ప్రకటించింది. 

ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ వీడియో రూపంలో తెలియజేశాడు. అది విన్న వెంటనే యూసఫ్ పఠాన్, మనీశ్ పాండేలు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా వీడియో చిత్రీకరించారు. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహాలాంటి ప్లేయర్లను విడుదల చేసి జట్టులో కీలక మార్పులు చేసింది. 
Read Also : ఈ సారి ఐపీఎల్ జరిగేది పాకిస్తాన్‌లో..: పాక్ క్రికెటర్