క్రీడా స్ఫూర్తి: పంత్ షూ లేస్ కట్టిన రైనా

క్రీడా స్ఫూర్తి: పంత్ షూ లేస్ కట్టిన రైనా

Updated On : May 11, 2019 / 6:15 AM IST

వైజాగ్ వేదికగా జరిగిన సూపర్ కింగ్స్ వర్సెస్ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రిషబ్ పంత్ షూ లేస్ ఊడిపోవడంతో రైనా వాటిని కట్టి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మైదానంలో మానవత్వం చనిపోలేదని ఒకరంటుంటే, క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడని పొగిడేస్తున్నారు. ఇలా క్రికెట్‌ను మరోసారి జెంటిల్‌మాన్ గేమ్ అని ప్రూవ్ చేశారు ఈ టీమిండియా క్రికెటర్లు. 

శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో క్యాపిటల్స్ తీవ్రంగా శ్రమించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగా విజయాన్ని అందుకుంది. ఢిల్లీపై 6వికెట్ల తేడాతో పైచేయి సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ అతికష్టంపై 147 పరుగులు చేసింది. చేధనకు దిగిన చెన్నై ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ చెరొక హాఫ్ సెంచరీతో టార్గెట్ చేధించడాన్ని సులువు చేసేశారు.  ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రైనా(11), రాయుడు(20), ధోనీ(9), బ్రావో(10)లు లాంచనాన్ని పూర్తి చేసి జట్టును గెలిపించారు. 

హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చి జట్టులో స్థైర్యాన్ని నింపిన డుప్లెసిస్ ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లు ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌ను ఆడనున్నాయి.