T20 World Cup 2021 : బాప్ రే.. వరల్డ్ కప్‌లో ఇదే బిగ్గెస్ట్ సిక్స్

టీ20 వరల్డ్ కప్ 2021లో బిగ్గెస్ట్ సిక్స్ నమోదైంది. ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెస్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో బిగ్గెస్ట్ సిక్స్..

T20 World Cup 2021 : బాప్ రే.. వరల్డ్ కప్‌లో ఇదే బిగ్గెస్ట్ సిక్స్

T20 World Cup 2021 Andre Russell

Updated On : November 6, 2021 / 8:20 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ 2021లో బిగ్గెస్ట్ సిక్స్ నమోదైంది. ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెస్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో బిగ్గెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రసెల్.. 111 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక దూరం వెళ్లిన సిక్స్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో రసెల్ 7 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఆస్ట్రేలియా, విండీస్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. సూపర్-12 దశను విజయంతో ముగించి సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి చేధించింది. మునుపటి ఫామ్ అందుకున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి. మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో హోసిన్, గేల్ తలో వికెట్ తీశారు.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ 29, హెట్మెయర్ 27 పరుగులు సాధించారు. తమ కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న గేల్ 15, బ్రావో 10 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 4 వికెట్లు తీశాడు. స్టార్క్, కమిన్స్, జంపా తలో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో ఆస్ట్రేలియా తన నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా, సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ 4 విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆసీస్ సెమీస్ చేరాలంటే… ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం వచ్చేవరకు ఆగాల్సి ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)