T20 World Cup 2021: కోహ్లీసేన ఇంత చెత్తగా ఓడిపోయిందా.., కోహ్లీ బలమే అది – ఇంజమామ్

అంతకంటే దారుణమైన ఆటతీరుతో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైంది. దీనిపై పాకిస్తాన్ టీం మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సైతం గొంతు విప్పాడు.

T20 World Cup 2021: కోహ్లీసేన ఇంత చెత్తగా ఓడిపోయిందా.., కోహ్లీ బలమే అది – ఇంజమామ్

Ind Vs Nz

Updated On : November 2, 2021 / 6:03 PM IST

T20 World Cup 2021: యావత్ ప్రపంచమంతా ఆశగా ఎదురుచూసిన జట్టు టీమిండియా.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీసేన రెండు మ్యాచ్ లకే చేతులెత్తేసింది. దాదాపు సెమీస్ కు చేరుకునే అవకాశాలు చేజార్చుకుంది. ఫలితంగా ఇంటాబయటా విమర్శలు తప్పడం లేదు. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఓడిపోవడం తర్వాత ఎటువంటి రియలైజేషన్ కనిపించలేదు.

అంతకంటే దారుణమైన ఆటతీరుతో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైంది. దీనిపై పాకిస్తాన్ టీం మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సైతం గొంతు విప్పాడు. ఈ పర్‌ఫార్మెన్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

‘భారత్‌-పాక్‌ మ్యాచ్ తర్వాత ఇదే అతిపెద్దది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ కన్నా భారత్‌ – కివీస్‌దే కీలకం‌. టీమిండియా ఆడిన తీరుతో షాక్‌కు గురయ్యా. ఆటగాళ్లంతా మనోస్థైర్యం కోల్పోయారు. అంతపెద్ద జట్టు ఇంత ప్రెజర్ ఎలా ఫీలైందో అర్థం కావడం లేదు. న్యూజిలాండ్ స్పిన్నర్లు మెరుగైన వారే అయినప్పటికీ.. వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లు మాత్రం కాదు. అలాంటి బంతులకు భారత బ్యాట్స్‌మన్‌ సింగిల్స్‌ కూడా తీయలేకపోవడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ కోహ్లీ బలమే స్పిన్‌ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోవడం. అలాంటిది అస్సలు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు’ అని ఇంజమామ్‌ యూట్యూబ్‌ ఛానల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

…………………………………………….: మణిశర్మ మెమరబుల్ మెలోడీ ‘నీలాంబరి’..

చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో 8వికెట్లు నష్టపోయి 110పరుగులు మాత్రమే చేసిన టీమిండియా.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో అదే 10వికెట్లు నష్టపోయి 151 మాత్రమే నమోదు చేసింది. కోహ్లీసేనను ఓడించిన రెండు జట్లు ప్రస్తుతం టాప్ లో నిలిచాయి.