T20 World Cup 2021: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు సచిన్‌పై అక్తర్ కామెంట్స్

మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.

T20 World Cup 2021: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు సచిన్‌పై అక్తర్ కామెంట్స్

T20 World Cup 2021

Updated On : October 23, 2021 / 9:37 AM IST

T20 World Cup 2021: మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య పోటీ అలాంటిది. వైరంతో పాటు.. రెగ్యూలర్ క్రికెట్ లో రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరగకపోవడంతో మరింత అంచనాలను పెంచేస్తుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా భారత్.. పాకిస్తాన్ ల మధ్య అక్టోబర్ 24న మ్యాచ్ జరగనుంది.

మ్యాచ్ కు ముందు రావల్పిండ్ ఎక్స్‌ప్రెస్ చేసిన కామెంట్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇండియన్ క్రికెట్ లెజెంట్ సచిన్ టెండూల్కర్ గురించి కొన్నేళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేశాడు. తనను ఫేస్ చేయడానికి సచిన్ టెండూల్కర్ భయపడ్డాడనే ఇంటెన్షన్ ఇప్పటివరకూ ఎవరితోనూ పంచుకోలేదని.. ఇదంతా మీడియా హైప్ కోసం క్రియేట్ చేసిందేనని అన్నాడు.

ఒకసారే కాదు ఎప్పటికీ ఈ డౌట్ ఇలానే ఉండిపోతుంది. వాటిని క్లియర్ చేద్దామనుకుంటున్నా. ఎందుకంటే మనం పుస్తకం రాస్తున్నామంటే అందులో అన్నీ సవివరంగా పొందుపరచాలి. ఫైసలాబాద్ లో.. సచిన్ కు మోచేతి గాయమైంది. ఈ బలహీనతను వాడుకుని అతణ్ని భయపెట్టాలనుకున్న మాట నిజం. అంతేకానీ, భయపడ్డాడని నేనెక్కడా చెప్పలేదు. అతను గ్రేట్ ప్లేయర్ కాదని కూడా అనలేదు’

……………………………………….. : పెళ్లి గిఫ్ట్‌ చూసి షాకైన వధువు

‘అతనిపై నాకు అమితమైన గౌరవం. 2016లో అతని ఇంటికి వెళ్లాం. నా కోసం వండాడు. వంట రుచిగా చేశాడు. మంచి వ్యక్తి కూడా. అప్పుడు నేను చెప్పిన దాని గురించి తనకు వివరించబోతుంటే.. అదంతా వదిలేయ్ గువాహటిలో మ్యాచ్ జరుగుతుండగా నన్ను కొట్టావ్. ఎక్కడ తగిలిందో తెలుసా.. రిబ్స్ లో..

హాస్పిటల్ కు వెళ్తే రిబ్ కేజ్ లో గాయమైందని చెప్పారట. శ్వాస కూడా అందడం కష్టంగా ఉందని డాక్టర్లు చెప్పగా.. గంగూలీ తనకెందుకు చెప్పలేదని ప్రశ్నించారట. టీమిండియా ఆందోళనకు గురికాకూడదని బయటకు చెప్పలేదని అన్నాడు. గాయమైందని తెలుసు గానీ ఆటను కొనసాగించానని అన్నాడట సచిన్. ప్రశ్నించారట.

ఈ మాజీ ఫాస్ట్ బౌలర్.. సచిన్, గంగూలీలు తన విషయంలో భయపడ్డారని ఎప్పుడూ చెప్పలేదు. ఇదంతా మీడియా హైప్ కోసమే క్రియేట్ చేశారని.. సచిన్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకుంటున్నానని అంటున్నాడు.