కివీస్‌ను వణికించిన బౌలర్లు, టీమిండియా టార్గెట్ 244

కివీస్‌ను వణికించిన బౌలర్లు, టీమిండియా టార్గెట్ 244

Updated On : January 28, 2019 / 5:56 AM IST

తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచేసిన టీమిండియా మూడో వన్డేలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను బౌలింగ్‌తో శాసించింది. ఫలితంగా 243పరుగులకే ఆలౌట్‌గా వెనుదిరిగింది కివీస్. గురువారం రెండో వన్డేలో అదే పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 324 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందుంచింది. కానీ, మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ సేన ఆ స్థాయి ప్రదర్శన చేయకపోగా వికెట్లు కాపాడుకునేందుకే తీవ్రంగా శ్రమించారు. 

ఈ నేపథ్యంలో రాస్ టేలర్ (93), టామ్ లాథమ్(51)మినహాయించి బ్యాట్స్‌మెన్ అంతా పేలవంగా అవుట్ అయ్యారు. టీమిండియా ఫేసర్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్, చాహల్, పాండ్యాలు మాత్రం ఒక్కొక్కరు 2వికెట్లు దక్కించుకున్నారు. 

భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే చాలు సిరీస్‌ వశమవుతుందని భావిస్తోంది. ఈ పర్యటనలో కెప్టెన్‌ కోహ్లికి ఇదే ఆఖరి మ్యాచ్‌. అందుకే ఇక్కడే సిరీస్‌ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. జట్టు ఎంపికలో సస్పెన్షన్‌ నుంచి తిరిగొచ్చిన హార్దిక్‌ పాండ్య ఉండడంతో అందరి దృష్టి అతనిపైనే ఉంది. 

భారత్‌ సిరీస్‌ గెలిస్తే.. 2014 పర్యటనలో ఎదురైన 0-4 పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లువుతుంది. విజయ్‌ శంకర్‌ స్థానంలో పాండ్య జట్టులోకి రావడం జట్టుకు బలంగా మారింది.