Virat Kohli: వన్డేల్లో కోహ్లీ రికార్డుల జోరు.. జయవర్ధనే రికార్డును అధిగమించిన విరాట్ ..
వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఒక్కో రికార్డును కోహ్లీ అధిగమిస్తూ వస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (166 పరుగులు) పూర్తిచేసిన కోహ్లీ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదవ స్థానంకు ఎగబాకాడు. అంతకుముందు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే (12,650 పరుగులు)ను కోహ్లీ ( 12,754 పరుగులు) అధిగమించాడు.

Virat Kohli
Virat Kohli: టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జూలు విదుల్చుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నారు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు చేసి అద్భుత ఫామ్ కొనసాగించాడు. గత కొద్దిరోజులుగా పరుగులు రాబట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డ కోహ్లీ.. కొంతకాలం టీమిండియా జట్టులోకూడా ఎంపిక కాలేదు. తాజాగా శ్రీలంక వన్డే సిరీస్ లో తన పూర్వవైభవాన్ని ప్రదర్శించారు. ఇప్పటికే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్ గా కోహ్లీ ఉన్నాడు.
Virat Kohli: సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ నమోదు
వన్డే క్రికెట్ చరిత్రలో సచిన్ టెండుల్కర్ 49 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. 46 సెంచరీలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ 463 మ్యాచ్ లలో 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 268 మ్యాచ్ లలోనే 46 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం సచిన్ సెంచరీల రికార్డును బద్దలుకొట్టే దిశగా కోహ్లీ పయనిస్తున్నాడు. శ్రీలంకతో చివరి వన్డేలో విరాట్ కోహ్లీ 166 పరుగులు చేశాడు. దీంతో మరో రికార్డును కోహ్లీ అధిగమించాడు.
Ind Vs SL : మూడో వన్డేలోనూ శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ, వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ (18,426) మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగర్కర (14,234), మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాటింగ్ (13,704), నాల్గో స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య (13,430) ఉన్నారు. శ్రీలంక తో జరిగిన చివరి వన్డేలో 166 సాధించడంతో కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన వారి జాబితాలో ఐదవ స్థానానికి చేరుకున్నాడు. గతంలో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్ధనే 12,650 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. తాజాగా కోహ్లీ 12,754 పరుగులతో జయవర్ధనేను అధిగమించి ఐదవ స్థానంకు చేరాడు. ప్రస్తుతం జయవర్ధనే అత్యధిక పరుగుల జాబితాలో 6వ స్థానంకు పడిపోయాడు. వీరిలో రికీ పాంటింగ్ (375 మ్యాచ్‌లు) మినహా మిగిలిన వారందరూ 400కుపైగా మ్యాచ్ లు ఆడినవారే. కోహ్లీ మాత్రం కేవలం 268 వన్డే మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించాడు.