Virat Kohli: అశ్విన్ రావడం మాకు కలిసొచ్చింది – విరాట్

అఫ్ఘానిస్తాన్ తో జరిగిన టీ20మ్యాచ్ లో చోటు దక్కడంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20 ఫార్మాట్ లో కనిపించాడు.

Virat Kohli: అశ్విన్ రావడం మాకు కలిసొచ్చింది – విరాట్

Ravi S=ashwin

Updated On : November 4, 2021 / 10:02 AM IST

Virat Kohli: రవిచంద్రన్ అశ్విన్ ఎట్టకేలకు టీమిండియా తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన టీ20మ్యాచ్ లో చోటు దక్కడంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20 ఫార్మాట్ లో కనిపించాడు. చివరిగా జులై 2017 మొహమ్మద్ నబీ జట్టుతో జరిగిన గేమ్ లోనే ఆడాడు.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న అశ్విన్ 4ఓవర్లలో 14పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా 2వికెట్లు కూడా తీశాడు. గేమ్ ను 66పరుగుల తేడాతో చేజిక్కించుకుంది టీమిండియా.

గేమ్ అనంతరం రవి ప్రదర్శనను కొనియాడాడు విరాట్. అతను రావడం జట్టుకు కలిసొచ్చిందని.. సీనియర్ స్పిన్నర్ బాగా కష్టపడ్డాడని అన్నాడు. ఐపీఎల్ లోనూ రాణించిన అశ్విన్.. చాలా స్మార్ట్ బౌలర్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

……………………………………… : విలన్స్ వర్సెస్ హీరోస్.. బిగ్ బాస్ లో బిగ్ ఫైట్

టీమిండియా సెమీ ఫైనల్స్ కు చేరుకోవడానికి చిన్నపాటి అవకాశాలు మాత్రమే ఉన్నాయని చెప్పిన కోహ్లీ.. చివరి వరకూ ప్రయత్నిస్తామని చెప్పాడు. అప్పుడే అయిపోయిందనుకోవడం లేదు. వాళ్ల దగ్గర సత్తా ఉంది కాబట్టి ఓడిపోయాం. కొన్నిసార్లు మేము గెలుస్తాం. తొలి 2 మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్లు బౌలింగ్ బాగా వేయగలిగారని కోహ్లీ వ్యాఖ్యానించాడు.