కోహ్లీ.. అనుష్క రొమాంటిక్ స్టీల్ యాడ్

టీమిండియా పరుగుల యంత్రం, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏం చేసినా అభిమానుల్లో సెన్సేషన్. ప్రేమ పెళ్లి చేసుకుని చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అనుష్కతో కలిసి కొన్ని యాడ్‌లలోనూ కనిపించాడు. పెళ్లికి ముందు యాడ్ ల కంటే పెళ్లి తర్వాత వీరిద్దరూ చేసిన యాడ్‌లకు మంచి స్పందన వస్తోంది.
Read Also : ఇండియా ఓపెన్ నుంచి సైనా అందుకే తప్పుకుందా..
బయట ఎక్కడ కనిపించినా భార్యపై పూర్తి కేరింగ్ తో కనిపించే కోహ్లీ.. ఈ యాడ్ లోనూ అలానే కనిపించాడు. ‘అనుష్క ఏదో పని చేసుకుంటుండగా కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. అనుష్క శర్మ తాగబోతుంటే వద్దని ఆపి వేడిగా ఉందంటూ చల్లార్చేందుకు దానిపై ఊదుతాడు.
దానికి ఇంప్రెస్ అయిపోయిన అనుష్క కోహ్లీని మెచ్చుకుంటుంది. ఆ తర్వాత కోహ్లీ మేం ఇంత అన్యోన్యంగా ఉండడానికి కారణం ఏంటని అందరూ అడుగుతుంటారని ఏదో చెప్పబోతుండగా అనుష్క ఆపేసి ఏం లేదంటూ బదులిస్తుంది. దానికి కోహ్లీ చిన్నబుచ్చుకోగా అనుష్క వెంటనే మా ఇద్దరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉందంటూ జవాబిస్తుంది. దానికి కోహ్లీ ఓ ముద్దివ్వగా బదులుగా అనుష్క ఇంకో ముద్దిచ్చి బ్రాండ్ పేరు చెప్పడంతో యాడ్ ముగుస్తుంది.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపటిలోనే అభిమానల్లోకి వేగంగా చేరుకుందీ వీడియో. మరి మీరూ ఓ లుక్కేయండి ఈ విరుష్కాల రొమాంటిక్ వీడియోని.
Was a joy shooting for this, #PureFun!
Check out the new Shyam Steel ad for their TMT bars made from #PureSteel.@AnushkaSharma @shyamsteel#PureLove #ShyamSteel #TMT pic.twitter.com/f9K9X7jhy3— Virat Kohli (@imVkohli) March 20, 2019