రెస్ట్ టైమ్: ‘విరుష్క’ వచ్చేస్తున్నారు.. ఎంజాయ్!
న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీతో పాటు అతని సతీమణి బాలీవుడ్ నటి అనుష్క కూడా వెళ్లింది. భర్తతో పాటు అక్కడే టీమిండియా విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది.

న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీతో పాటు అతని సతీమణి బాలీవుడ్ నటి అనుష్క కూడా వెళ్లింది. భర్తతో పాటు అక్కడే టీమిండియా విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది.
వరుస మ్యాచ్ లు.. నెట్ లో గంటల తరబడి ప్రాక్టీస్.. ఆ వెంటనే మళ్లీ మ్యాచ్.. వర్క్ లోడ్ పెరిగిపోతుంది. క్షణం తీరికలేదు. 2019 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరోవైపు ఐపీఎల్ సమరం కూడా సిద్ధం కానుంది. వీటికి ముందుగానే ఆస్ట్రేలియాతో హోం సిరీస్ ఆడాల్సి ఉంది. ఇలోపు ఫిట్ నెస్, హెల్త్ సపోర్ట్ చేయాలంటే కాస్తయిన క్రికెటర్లకు రెస్ట్ కావాలి కదా? అందుకే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో టీమిండియా పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల్లో గెలిచిన టీమిండియా 3-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక మిగిలింది రెండు వన్డేలే. కోహ్లీ లేకపోయినా పర్వాలేదులే. ఎలాగో సిరీస్ సొంతమైంది కదా? ఆందోళన అక్కర్లేదులే.. కోహ్లీ రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఇది అనే భావన అభిమానుల్లో ఉంది.
ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీతో పాటు అతని సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా వెళ్లింది. భర్తతో పాటు అక్కడే టీమిండియా విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. మిగతా రెండు వన్డేలకు కోహ్లీకి రెస్ట్ దొరకడంతో తిరిగి విరుష్క జంట భారత్ కు పయనమైంది. ఈ క్రమంలో మంగళవారం విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో పోస్టు చేశాడు. విమానం దగ్గర అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ షేర్ చేశాడు. చివరిగా దీనికి ‘అవే.. వి.. గో’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ తో జరుగనున్న రెండు వన్డేలు, టీ20 సిరీస్ లకు టీమిండియా తరపున రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Away we go ❤️?#travelswithher pic.twitter.com/KnDhMbAG3G
— Virat Kohli (@imVkohli) January 29, 2019