ఏం మాట్లాడుతున్నారు: సచిన్.. కోహ్లీ లాంటి లీడర్ల మధ్య పోలికలా

ఏం మాట్లాడుతున్నారు: సచిన్.. కోహ్లీ లాంటి లీడర్ల మధ్య పోలికలా

రికార్డుల వీరుడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లలో బెస్ట్ ఎవరని అంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేతులెత్తేశాడు. ఓ ఇంగ్లీష్ మీడియా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, గ్యారీ సోబర్స్‌లను పోల్చడం ఎంత కష్టమో.. సచిన్.. కోహ్లీలను పోల్చడం కూడా అంతే కష్టం. వారిద్దరూ ఉన్న జనరేషన్‌లు వేరు. అలాంటి వాళ్లని ఎలా పోలుస్తాం’

‘నేనెప్పుడూ ఒకటే నమ్ముతా లీడర్ల మధ్య పోలికలు ఉండకూడదు.  జనరేషన్‌ను బట్టి ఒక్కో ప్లేయర్ గుర్తుండిపోయే వ్యక్తిగా నిలిచిపోతాడు. డాన్ బ్రాడ్‌మన్ అలాంటి వాడే. మీరు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను పోల్చుతూ అవే ప్రశ్నలు అడుగుతున్నారు. నా దృష్టిలో వారిద్దరూ కూడా అంతే. పరుగుల రాబట్టడంలో ఆయా సమయాలను బట్టి వారి ప్రత్యేకతను చాటుకున్నారు’

‘సచిన్.. కోహ్లీల మధ్య సారూప్యత ఉంది. వారిద్దరూ రోల్ మోడల్‌గా ఎదిగారు. ఒక స్థాయికి మించిన ప్రదర్శన చేసినప్పుడు అప్పుడు జట్టులో ఉన్నవాళ్లతో పోల్చుకోవాలే కానీ, జనరేషన్ దాటిపోకూడదని’ రవిశాస్త్రి ముగించాడు.