Virat Kohli: కోహ్లి ఓపెనర్‌గా వస్తే.. కప్పు గెలవడం కష్టమే
ఐపీఎల్‌లో కూడా విరాట్ మిడిల్ ఆర్డర్‌లో ఆడాలని, ఓపెనర్‌గా రాకూడదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కోహ్లి ఓపెనర్‌గా వస్తే ఆర్‌సీబీ కప్పు గెలవడం కష్టమేనని అంటున్నాడు

Virat Kohli
Virat Kohli: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. టీమ్ఇండియా(Team India)కు ఆడేటప్పుడు మూడో స్థానంలో బరిలోకి దిగే విరాట్ ఐపీఎల్‌లో మాత్రం గత కొంతకాలంగా ఓపెనర్‌గా ఆడుతున్నాడు.
అయితే.. ఐపీఎల్‌లో కూడా విరాట్ మిడిల్ ఆర్డర్‌లో ఆడాలని, ఓపెనర్‌గా రాకూడదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కోహ్లి ఓపెనర్‌గా వస్తే ఆర్‌సీబీ కప్పు గెలవడం కష్టమేనని చెబుతున్నాడు. పఠాన్ ఇలా అనడానికి కారణం లేకపోలేదు. ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉంది. గత మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో బెంగళూరు 81 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 21 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్ ముంబై పై గెలువగా రెండో మ్యాచ్ కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఆర్‌సీబీ విజయాల్లో ఓపెనర్లే ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు విరాట్ కోహ్లిలు ఇద్దరూ ఓపెనింగ్‌లో వస్తుండడంతో మిడిల్ ఆర్డర్‌లో చాలా వీక్‌గా కనిపిస్తోంది. ప్రత్యర్థులు దీన్నే సొమ్ము చేసుకోవాలని బావిస్తున్నారని పఠాన్ అంటున్నాడు.
ఒకవేళ విరాట్ కనుక మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగితే సమతూకం వస్తుందని చెప్పాడు. లేదంటే ఈ సీజన్‌లోనైనా కప్పు గెలవాలని బావిస్తున్న ఆర్‌సీబీకి మరోసారి నిరాశే మిగిలే అవకాశం ఉందని అంటున్నాడు. అదే సమయంలో మిగిలిన బ్యాటర్లు సైతం బాధ్యతను తీసుకోవాలని, ప్రతి మ్యాచులోనూ విరాట్ రాణించాలని బావించవద్దని అన్నాడు.
ఐపిఎల్‌లో అత్యధిక పరుగుల స్కోరర్ అయిన విరాట్.. ఓపెనర్‌గా 135.11 స్ట్రైక్ రేట్‌తో 86 ఇన్నింగ్స్‌లలో 3075 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 3లో అతను 93 ఇన్నింగ్స్‌లలో 2815 పరుగులు చేశాడు, ఇందులో 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. సొంత మైదానంలో సత్తా చాటాలని బెంగళూరు బావిస్తోంది.
IPL 2023 : హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచింది, రెండు ఓటముల తర్వాత విజయం