41ఏళ్ల వయస్సులో ఏంది సామీ ఈ బాదుడు.. ఇంగ్లాండ్‌పై విధ్వంసం సృష్టించిన ఏబీ డివిలియర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

డబ్ల్యూసీఎల్ -2025 లో భాగంగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది.

41ఏళ్ల వయస్సులో ఏంది సామీ ఈ బాదుడు.. ఇంగ్లాండ్‌పై విధ్వంసం సృష్టించిన ఏబీ డివిలియర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

AB de Villiers

Updated On : July 25, 2025 / 7:03 AM IST

WCL 2025 AB de Villiers century: దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. తుపాను ఇన్నింగ్స్‌తో 41ఏళ్ల వయస్సులో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోతకోశాడు. క్రీజులోకి వచ్చిన సమయం నుంచి సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అతను.. 51 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. 41ఏళ్ల వయస్సులో ఏంది సామీ ఈ బాదుడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే..

Also Read: Ind Vs Eng: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే..

డబ్ల్యూసీఎల్ -2025 లో భాగంగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ ఇంగ్లాండ్ బౌలర్లను చావుదెబ్బ కొట్టాడు. సిక్సులు ఫోర్లతో హడలెత్తించాడు.


హసీమ్ ఆమ్లాతో కలిసి క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడాడు. తుపాను ఇన్నింగ్స్ తో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 51 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి. డివిలియర్స్ బౌండరీల మోతమోగిస్తుంటే హసిమ్ ఆమ్లా చూస్తూ ఉండిపోయాడు. ఆమ్లా 25 బంతుల్లో 29 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ కేవలం 12.3 ఓవర్లలోనే జట్టు విజయం సాధించింది.