WCL 2025 : భారత్, పాక్‌లు సెమీస్ లేదా ఫైనల్‌లో తలపడాల్సి వస్తే.. అప్పుడు ఏం జరుగుతంది? జట్టు యజమాని హింట్..
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది.

What Will Happen If India and Pakistan Reach wcl semis or Final
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. టీమ్ఇండియా స్టార్లు ఆటగాళ్లు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, సురైశ్ రైనా వంటి ఆటగాళ్లు పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు తిరస్కరించడమే అందుకు కారణం. ఏప్రిల్‌లో పహల్గాం దాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో సీజన్ పోటీలు ఈ నెల 18న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యాయి. కాగా.. పాక్, భారత్ రద్దు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు ప్రకటించారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే భారత జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో తలపడాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అన్న దానిపై అందరి దృష్టి నిలిచింది.
దీనిపై పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు యజమాని కమిల్ ఖాన్ స్పందించాడు. భారత్, పాక్ మ్యాచ్ రద్దు పై మాట్లాడుతూ.. మిగిలిన అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అందులో ఎలాంటి మార్పు లేదు అని జియో న్యూస్‌తో అన్నాడు.
ఇక సెమీ పైనల్, ఫైనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. మేము సెమీఫైనల్స్‌కు చేరుకుంటే.. అప్పుడు నాలుగు జట్లు ఉంటాయి. కాబట్టి రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను నివారించాలని ప్రస్తుతం చెబుతున్నాము. అదే ఫైనల్‌కు చేరుకుంటే ఏం చేయాలనే విషయం పై నిర్ణయం తీసుకోలేదు. దానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు.