WI vs IND 1ST Test : తొలిరోజు ముగిసిన ఆట.. 150 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్.. UPDATES

భారత్‌, వెస్టిండీస్ మొద‌టి టెస్టుకు రంగం సిద్ధమైంది. టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు

WI vs IND 1ST Test : తొలిరోజు ముగిసిన ఆట.. 150 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్.. UPDATES

IND vs WI 1ST Test

Updated On : July 13, 2023 / 8:45 AM IST

WI vs IND : టీమ్ఇండియా, వెస్టిండీస్ జ‌ట్ల ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (2023-2025) కొత్త సైకిల్ జరుగుతోంది. డొమినికాలోని రోసోలో గ‌ల విండ్స‌ర్ పార్కు వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు కొనసాగుతోంది.

నాలుగో వికెట్.. లంచ్ బ్రేక్‌

వెస్టిండీస్ 68 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. జ‌డేజా బౌలింగ్‌లో బ్లాక్ వుడ్ బంతిని బౌండ‌రీకి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌గా సిరాజ్ అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. లంచ్ విరామానికి వెస్టిండీస్ స్కోరు 68/4

రేమన్ రీఫర్ ఔట్‌.. మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్‌

వెస్టిండీస్ బ్యాట‌ర్లు క్రీజులో నిల‌దొక్కులేక‌పోతున్నారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రేమన్ రీఫర్ (2) వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ చేతికి చిక్కాడు. దీంతో విండీస్ 47 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఓపెన‌ర్ల‌ను పెవిలియ‌న్‌కు చేర్చిన అశ్విన్‌.. బ్రాత్‌వైట్ ఔట్‌

ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో బ్రాత్ వైట్(20) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో వెస్టిండీస్ జ‌ట్టు 38 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్లు ఇద్ద‌రిని కూడా అశ్వినే ఔట్ చేశాడు.

అశ్విన్‌కే మొద‌టి వికెట్‌

వెస్టిండీస్ మొద‌టి వికెట్‌ను కోల్పోయింది. టగ్ న‌రైన్ చంద్ర‌పాల్(12) అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ జ‌ట్టు 31 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. బ్రాత్ వైట్ (13), రేమన్ రీఫర్(0) లు క్రీజులో ఉన్నారు.

భార‌త తుది జ‌ట్టు :

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కట్‌, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్ తుది జ‌ట్టు : 

క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), ట‌గ్ నరైన్ చంద్రపాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్‌, అలీక్ అథనేజ్, జాషువా డా సిల్వా(వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, రకీమ్ కార్న్‌వాల్‌, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.

టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇషాన్ కిష‌న్, య‌శ‌స్వి జైశ్వాల్‌లు ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. ఇషాన్‌ను వికెట్ కీప‌ర్‌గా తీసుకోవ‌డంతో తెలుగు ఆట‌గాడు కేఎస్ భ‌ర‌త్‌కు చోటు ద‌క్క‌లేదు.